గొప్ప మనసు చాటుకుంటున్న లారెన్స్.. మొన్న ఇల్లు.. నేడు బైక్స్..

గొప్ప మనసు చాటుకుంటున్న లారెన్స్. మొన్నేమో ఇల్లు అందించారు. నేడు బైక్స్..

Raghava Lawrence : స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డాన్సర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఆడియన్స్ అభిమానాన్ని గెలుచుకున్న లారెన్స్.. ఒక గొప్ప మనిషిగా అంతకుమించి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వికలాంగులకు, అనాథల, పేద వాళ్ళకు నిస్వార్థంగా సేవ చేస్తూ లారెన్స్ తన గొప్ప మనసుని చాటుకుంటూ వస్తున్నారు.

ఇటీవలే ఒక పేద మహిళా డ్రైవర్‌కి.. కొత్త ఆటో బహుమతిగా అందించి ఆమెను సంతోషపరిచారు. ఇక తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణి చేసి వారి మొఖాల్లో చిరునవ్వు తీసుకు వచ్చారు. సరైన గూడు లేక ఇబ్బందులు పడుతున్న ఆ వికలాంగులకు ఇల్లు కట్టిస్తాను అని లారెన్స్ గతంలో మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇటీవలే వారికీ కొత్త ఇంటిని ఇచ్చారు.

Also read : Pushpa 2 : నార్త్‌లో పుష్ప గాడి రూల్ మాములుగా లేదుగా.. కల్కి, దేవరని మించి ప్రీ రిలీజ్ బిజినెస్..!

ఇక ఇప్పుడు వారి కోసం బైక్స్ కూడా డొనేట్ చేసి వారిని మరింత సంతోష పరిచారు. మొత్తం 13 బైక్స్ ని లారెన్స్ వారికీ అందించి సర్‌ప్రైజ్ చేసారు. ఆ బైక్స్ చూసి ఆ వికలాంగులు సంతోషంతో కన్నీరు పెట్టుకున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోని లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. కాగా త్వరలోనే ఆ బైక్స్ ని వికలాంగులకు తగ్గట్లు త్రీ వీలర్స్ గా మార్చి ఇస్తానని లారెన్స్ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ లారెన్స్ ని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు