Raghava Lawrence: కృష్ణంరాజు గారిని కడసారి చూసుకోలేకపోవడం నా దురదృష్టకరం.. రాఘవ లారెన్స్

టాలీవుడ్ రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా అయన అకాల మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ డాన్స్ మాస్టర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా రెబల్ స్టార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Raghava Lawrence: టాలీవుడ్ రియల్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ నుంచి మొయినాబాద్ ఫామ్ హౌస్ వరకు అధికార లాంఛనాల మధ్య అంతిమయాత్రగా తీసుకువెళ్లగా, ప్రభాస్ అన్న ప్రభోద్ తలకొరివి పెట్టడంతో అంత్యక్రియలు ముగిసాయి.

Krishnam Raju with Other Heros : 50 మల్టీస్టారర్ సినిమాలు.. ఎక్కువమందితో కలిసి చేసిన హీరో.. ఆయన రూటే సపరేట్..

కృష్ణంరాజు గారికి తుది వీడుకోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. ఇక కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అయన అకాల మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ డాన్స్ మాస్టర్ మరియు దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా రెబల్ స్టార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గతంలో “రెబల్” సినిమా కోసం వీరిద్దరూ కలిసి పని చేశారు.

“అందరినీ తన బిడ్డలా చూసుకుంటూ, తల్లిలా భోజనం పెట్టె మా రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఇక లేరంటే నమ్మలేకపోతున్నా. కల్ముషం లేని ప్రేమని చూపించే కృష్ణంరాజు గారిని కడసారి చేసుకోలేకపోవడం నా దురదృష్టకరం. ప్రస్తుతం నేను ఇండియాలో లేకపోవడంతో అయన్ని కడసారి చూసుకోలేకపోతున్నా” అంటూ ట్విట్టర్ వేదిక రెబల్ స్టార్ పట్ల తన గౌరవాన్ని చూపించారు.

ట్రెండింగ్ వార్తలు