Raghavendra Rao : 100కు పైగా సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. రాఘవేంద్రరావు – చిరంజీవి కాంబోలో వచ్చిన అతి పెద్ద హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి.
ఈ సినిమా నిన్న మే 9న రీ రిలీజయింది. ఈ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ లతో యాంకర్ సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా ఇందులో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.
ఈ క్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ముందు నావి వరుసగా మూడు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఒంటరి పోరాటం, అగ్ని, రుద్రనేత్ర సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రాఘవేంద్రరావు పని అయిపోయింది అన్నారు. నెక్స్ట్ సినిమాలు చేయడు అన్నారు. ఆ టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కథని ఒక లైన్ గా వినిపించారు అశ్వినీదత్. నేను ఫ్లాప్ లో ఉన్నాను చేయడమో అనుకున్నారు ఇండస్ట్రీలో చాలా మంది. కానీ నేనే చేయగలను అని నన్ను నిర్మాత, చిరంజీవి నమ్మారు. చిరంజీవి పట్టుబట్టి నేనే కావాలి ఈ కథకు దర్శకుడిగా అని అడిగారు. చాలామంది సినీ పరిశ్రమ వ్యక్తులే రాఘవేంద్రరావు ఫ్లాప్స్ లో ఉన్నాడు, ఆయనతో సినిమా వద్దన్నారు. అయినా చిరంజీవి, నిర్మాత ఇద్దరూ రాఘవేంద్ర రావు ఉండాలి, ఆయనే సోషియో ఫాంటసీ డీలింగ్ చేయగలడు అని అనుకున్నారు అని చెప్తూ ఎమోషనల్ అయి మెగాస్టార్ ని హగ్ చేసుకున్నారు.
Also Read : Pavani Karanam : పుష్ప 2 సినిమా వల్ల కొన్ని మంచి సినిమాలు ఛాన్సుల మిస్ అయ్యాను.. పావని వ్యాఖ్యలు వైరల్..