‘ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు’ – నవంబర్ 29 విడుదల

సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేయనున్నారు..

  • Published By: sekhar ,Published On : November 6, 2019 / 11:46 AM IST
‘ర‌ఘుప‌తి వెంక‌య్య నాయుడు’ – నవంబర్ 29 విడుదల

Updated On : November 6, 2019 / 11:46 AM IST

సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేయనున్నారు..

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. తెలుగులో ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే.. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటించారు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలవబడే రఘుపతి వెంకయ్య నాయుడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

ఈ సినిమా గురించి నరేష్ మాట్లాడుతూ ‘రఘుపతి వెంకయ్యగారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకు ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది’ అన్నారు.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్య గారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం’ అన్నారు. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.