Raghurama Krishnam Raju : చిరంజీవి ఎప్పుడూ ఇలానే మాట్లాడితే బాగుంటుంది.. మంచి చేసినప్పుడు కూడా..

ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.. చిరంజీవి ఎప్పుడు ఇలానే మాట్లాడితే బాగుంటుంది.

Raghurama Krishnam Raju about Chiranjeevi comments on AP government

Raghurama Krishnam Raju : నిన్న ఆగష్టు 7న జరిగిన వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బ్రో సినిమా విషయంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడాన్ని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేశారు. రాజకీయాలు నుంచి వచ్చేసిన చిరంజీవి.. మళ్ళీ పాలిటిక్స్ పై ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. తాజాగా వీటిపై వైసీపీ (YCP) ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు.

Chiranjeevi : చిరంజీవి కామెంట్స్ పై వైసీపీ నాయకులు రియాక్షన్.. గిల్లినప్పుడు.. గిల్లించుకోవాలి..

ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి మాట్లాడింది అక్షర సత్యం. ఒకపక్క వరదలు వచ్చి పోలవరం గట్టున ఉన్న గ్రామాలూ ఇబ్బందులు పడుతుంటే ఇరిగేషన్ మంత్రి ఇప్పటి వరకు అటువైపుగా వెళ్ళలేదు. కానీ బ్రో సినిమా పై కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ వచ్చేశాడు. రాష్ట్రంలో వాళ్ళు పోరాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్.. ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి పట్టించుకోకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడుతుంటే చిరంజీవి స్పందించడంలో తప్పేంటి. సినిమా పై ప్రభుత్వమంతా కలిసి చూపుతున్న పగపై మాట్లాడకుండా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు తనదైన రీతిలో గడ్డిపెట్టరు. అయిన ఎప్పుడు ఇలానే మాట్లాడితే బాగుంటుంది. అలాగే ప్రభుత్వం మంచి చేసినప్పుడు కూడా మెచ్చుకోవాలి. కానీ మా ప్రభుత్వం మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు అనుకోండి” అంటూ సెటైరికల్ గా మాట్లాడారు.

Kodali Nani : చిరంజీవి వ్యాఖ్యలపై కొడాలి నాని రియాక్షన్.. ఇండస్ట్రీలో పకోడీ గాళ్లు..

కాగా చిరు వ్యాఖ్యలు పై ఇతర వైసీపీ నాయకులు కూడా స్పందిస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు. ‘పకోడిగాళ్లా ప్రభుత్వానికి సలహా ఇచ్చేది’ అని కోడలి నాని వ్యాఖ్యానించారు. అలాగే పేర్ని నాని.. మనం మరొకరిని గిల్లినప్పుడు, గిల్లించుకోవాలి కూడా” అంటూ పేర్ని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హీటుని పెంచేస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు