Rahul Dev sensational comments on South Movies
Rahul Dev : సింహాద్రి, మాస్, ఆంధ్రావాలా, నాయక్, ఎవడు… ఇలా అనేక తెలుగు సినిమాల్లో విలన్ గా నటించిన రాహుల్ దేవ్(Rahul Dev) ప్రస్తుతం బాలీవుడ్(Bollywood) లో పలు సినిమాలు, సిరీస్ లలో నటిస్తున్నాడు. ఢిల్లీకి(Delhi) చెందిన రాహుల్ దేవ్ బాలీవుడ్ తో ఎంట్రీ ఇచ్చినా సౌత్(South) సినిమాల్లో విలన్ గానే ఎక్కువ పేరు సంపాదించాడు. ప్రస్తుతం రాహుల్ దేవ్ నటించిన గ్యాస్‌లైట్(Gas Light) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా హాట్ స్టార్(Hotstar) లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ దేవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Sai Dharam Tej : యాక్సిడెంట్ వల్ల నా మాట పడిపోయింది.. నా మీద ట్రోల్స్ చేశారు..
రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. సౌత్ సినిమాలు ఇటీవల బాగా ఆడుతున్నాయి. కానీ అవన్నీ కూడా 1970-80 సినిమాల కథలే. అప్పటి సినిమా కథలే ఇప్పటికి తీస్తున్నారు. అవే ఫాలో అవుతున్నారు. అప్పటి కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి చెప్తున్నారు. ఇక సౌత్ సినిమాల్లో కొన్ని యాక్షన్, ఫైట్ సీక్వెన్స్ లో మరీ ఓవర్ గా ఉంటాయి కానీ వాళ్ళు చెప్పే కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ట్రై చేస్తున్నారు. దానివల్లే ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నారు. కాబట్టి కథని చెప్పిన విధానం, దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ముఖ్యం అని అన్నారు. దీంతో రాహుల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పలువురు సౌత్ నెటిజన్స్ రాహుల్ ని ట్రోల్ చేస్తున్నారు.