Sai Dharam Tej : యాక్సిడెంట్ వల్ల నా మాట పడిపోయింది.. నా మీద ట్రోల్స్ చేశారు..

విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాక్సిడెంట్ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయిందో తెలిపాడు.

Sai Dharam Tej : యాక్సిడెంట్ వల్ల నా మాట పడిపోయింది.. నా మీద ట్రోల్స్ చేశారు..

Sai Dharam Tej comments on his accident and after incidents

Updated On : April 2, 2023 / 4:52 PM IST

Sai Dharam Tej :  మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని, తనకు కూడా అభిమానులని ఏర్పరుచుకున్నారు. సాయి ధరమ్ తేజ్ కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురయి చాలా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని నెలలు చికిత్స తీసుకొని బయటకు రాకుండా, హాస్పిటల్, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. మొత్తం రికవర్ అయ్యాకే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు.

తేజ్ త్వరలో విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో చిత్రయూనిట్ ఇటీవలే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. విరూపాక్ష ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరమ్ తేజ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాక్సిడెంట్ తర్వాత తన లైఫ్ ఎలా మారిపోయిందో తెలిపాడు.

Rishab shetty : నేను రాజకీయాల్లోకి రాను.. నాకు సినిమాల్లో మద్దతు ఇవ్వండి చాలు..

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం నాకు ఒక పీడ కలలా కాకుండా, ఒక లెస్సన్ లా మిగిలింది. దీని వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా మాట విలువ తెలిసింది. కొంతమంది నా యాక్సిడెంట్ విషయంలో నన్నే ట్రోల్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత చాలా రోజుల వరకు నేను మాట్లాడలేకపోయా. ఒకప్పుడు గలగలా మాట్లాడేవాడిని కానీ యాక్సిడెంట్ తర్వాత నా మాట పడిపోయింది. కానీ ఇంట్లో వాళ్ళు, మామయ్య పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పి ఒక్కో పదం నాతో మాట్లాడించారు. వాళ్లంతా నాకు ధైర్యం చెప్పారు. మళ్ళీ నా జీవితాన్ని మొదటి నుంచి ప్రారంభించినట్లు అనిపించింది. సెట్ లో కూడా డైలాగ్స్ చెప్పడానికి కష్టపడ్డాను, కానీ యూనిట్ అంతా నాకు సహకరించారు అని తెలిపాడు.