Rishab shetty : నేను రాజకీయాల్లోకి రాను.. నాకు సినిమాల్లో మద్దతు ఇవ్వండి చాలు..
కాంతార సినిమాతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ప్రస్తుతం రిషబ్ కాంతార ప్రీక్వెల్ సినిమాపై పనిచేస్తున్నాడు. ఇక కాంతార సక్సెస్ తో అనేక అవార్డులు అందుకున్నాడు.

Rishab shetty Comments on his entry in Politics
Rishab shetty : ఇటీవల కాంతార సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి. దాదాపు 10 ఏళ్లుగా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా, నటుడిగా ఉన్నా రాని గుర్తింపు ఒక్క కాంతార సినిమాతో వచ్చాయి. చిన్న సినిమాగా కన్నడలో రిలీజయి ఆ తర్వాత పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించింది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా ఏకంగా 400 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమాతో నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ప్రస్తుతం రిషబ్ కాంతార ప్రీక్వెల్ సినిమాపై పనిచేస్తున్నాడు. ఇక కాంతార సక్సెస్ తో అనేక అవార్డులు అందుకున్నాడు. పలువురు రాజకీయ నాయకులను కలిశాడు. పలు వేదికలపై మాట్లాడాడు. దీంతో తాజాగా రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి రానున్నట్టు వార్తలు వచ్చాయి.
ఓ జర్నలిస్ట్ దీనిపై స్పందిస్తూ.. రిషబ్ రాజకీయాల్లోకి రానున్నారు. ఈ రోజు ఇదే పెద్ద వార్త అని రాసి రిషబ్ ని ట్యాగ్ చేయగా ఇలాంటి ఫేక్ న్యూస్ ఆపండి. ఇవాళ ఏప్రిల్ 1. కొంతమంది అయితే నేను ఏకంగా ఓ పార్టీలో కూడా జాయిన్ అయ్యాయని రాశారు, నేను రాజకీయాల్లోకి వెళ్లట్లేదు అంటూ సీరియస్ గానే కౌంటర్ వేసాడు రిషబ్. మరింతమంది రిషబ్ అభిమానులు కూడా మీరు రాజకీయాల్లోకి రండి మేము సపోర్ట్ చేస్తాము అని కామెంట్స్ చేయగా రిషబ్ స్పందిస్తూ.. నాకు రాజకీయాల్లో మీ మద్దతు వద్దు, నేను రాజకీయాల్లోకి రాను. నన్ను ఇలా సినిమాల్లో ఆదరించండి చాలు అని అన్నారు. దీంతో రిషబ్ చేసిన ట్వీట్స్ కన్నడలో వైరల్ గా మారాయి.
ಸುಮ್ನನೆ ಇರಿ ಮರ್ರೆ ? ಸುಳ್ಳು ಸುದ್ದಿ, #April1st ಹೀಗೆ ಹೇಳಿ… ಮೊದಲೇ ಕೆಲವರು ನನ್ನ ಒಂದು ಪಕ್ಷಕ್ಕೆ ಸೇರಿಸಿದ್ದಾರೆ ? ನಾನು ರಾಜಕೀಯಕ್ಕೆ ಎಂದು ಹೋಗುವುದಿಲ್ಲ ?
— Rishab Shetty (@shetty_rishab) April 1, 2023
ಬೇಡ ದೇವ್ರು, ನನ್ನ ಸಿನಿಮಾಗೆ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಇದ್ರೆ ಸಾಕು ?
— Rishab Shetty (@shetty_rishab) April 1, 2023