Site icon 10TV Telugu

Rahul Sankrityan : సినిమా షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఆవేద‌న‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ డైరెక్ట‌ర్ ట్వీట్‌.. టాలీవుడ్ స‌మ్మె పై..

Rahul Sankrityan tweet over tollywood strike

Rahul Sankrityan tweet over tollywood strike

టాలీవుడ్‌లో వేత‌నాలు పెంచాల‌ని ప్ర‌స్తుతం స‌మ్మె జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో షూటింగ్ అన్నీ నిలిచిపోయాయి. ఇందులో భాగంగా విజ‌య్‌దేవ‌ర‌కొండ కొత్త సినిమా షూటింగ్ మొద‌లు కావాల్సి ఉండ‌గా అది కూడా ఆగిపోయింది. దీంతో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్యాన్ సోష‌ల్ మీడియాలో టాలీవుడ్ స‌మ్మెపై స్పందించాడు.

“ప్రతి సంవత్సరం ఆడియన్స్ చూసే కంటెంట్ మారిపోతుంది, కాబట్టి బిజినెస్ మారిపోతుంది. తద్వారా సగటు సినిమా బడ్జెట్ మారిపోతున్న క్ర‌మంలో ఇంతమందిని తీసుకోవాలి.. ఇంతే ఇవ్వాలి అనడం సబబు కాదు. తన శక్తి మేరకు తనకు సరిపడా ఆర్మీ ని బిల్డ్ చేసుకునే స్వేచ్ఛ ప్రొడ్యూసర్ కి ఉండాలి. ఎందుకంటే చివరికి రిస్క్ అంతా ప్రొడ్యూసర్‌దే. ఆ విధానంలో పని చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. అలాగే రోజంతా కష్టపడే వర్కర్స్‌కి పెరిగిన ధరల దృష్ట్యా, వర్క్‌మాన్‌షిప్ దృష్ట్యా వేతనం పెంచమని అడిగే హక్కు పూర్తిగా ఉంది. దానికి స్పందిస్తూ రూ.2000/day లేదా అంతకన్నా తక్కువ తీసుకుంటున్న వర్కర్స్‌కి వేతనం పెంచడం అన్న నిర్ణయం హర్షణీయం.” అని రాసుకొచ్చాడు.

Sathi Leelavathi : లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సాంగ్ విన్నారా?

కింగ్‌డ‌మ్ చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తాజాగా ఆయ‌న రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించాల్సి ఉంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఈ వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. కార్మికుల సమ్మెతో షూటింగ్ వాయిదా ప‌డింది. కాగా.. విజ‌య్‌దేర‌కొండ‌, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన ట్యాక్సీవాలా చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. దీంతో కొత్త సినిమాపై అభిమానుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Exit mobile version