Sathi Leelavathi : లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సాంగ్ విన్నారా?

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘సతీ లీలావతి’. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

Sathi Leelavathi : లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి సాంగ్ విన్నారా?

Chittoor Pilla Lyrical from Lavanya Tripathi Sathi Leelavathi movie

Updated On : August 12, 2025 / 5:53 PM IST

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘సతీ లీలావతి’. తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నాగ మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఫ‌స్ట్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ‘ఓరి పిల్లా..చిత్తూరు పిల్లా..’ అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాటకు వనమాలి లిరిక్స్‌ అందించగా.. నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేజ్ జి రావులు పాడారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

Bhumi Pednekar : అరలీటరు నీళ్లు 150 రూపాయలా? హీరోయిన్ కొత్త బిజినెస్ బాగుందిగా..

స‌తీ లీలావ‌తి సినిమా షూటింగ్ పూరైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.