Rahul Sipligunj : అందుకే పహిల్వాన్స్ తో తిరుగుతా.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipliganj revealed the top secret about Pahalwans
Rahul Sipligunj : ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్, ఓల్డ్ సిటీలో బోనాల పాటలు చేసుకుంటూ.. భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. అలా ఈ సాంగ్స్ చేసుకుంటూ పలు సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో సాంగ్స్ పాడుతూ బిజీగా ఉన్నారు. అయితే RRR సినిమాలో ఈయన పాడిన నాటు నాటు పాటికి గాను ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో తన రేంజ్ మరింత పెరిగిపోయింది.
ఇదిలాఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. పహిల్వాన్స్ తో స్నేహం చెయ్యడం గురించి షాకింగ్ నిజాన్ని రివీల్ చేశారు. నిజానికి రాహుల్ ఓల్డ్ సిటీ కుర్రాడు. అందుకే తనకి పహిల్వాన్స్ బాగా దగ్గర ఫ్రెండ్స్ . దీనిగురించి ఆయన ఇలా అన్నారు. పహిల్వాన్స్ అంటే గొప్ప పేరున్న వ్యక్తులు. మనకి టెక్నాలజీ లేని సమయంలో వాళ్ళే కొన్ని కొన్ని సెటిల్ మెంట్స్ చేసి పేరు తెచ్చుకున్నవారు ..
Also Read : Rahul Sipligunj : ఆస్కార్ వచ్చినంత మాత్రాన డబ్బులు రావు.. రాహుల్ సిప్లిగంజ్ షాకింగ్ కామెంట్స్
అలాంటి సమయంలో కొన్ని కొన్ని గొడవలు జరగొచ్చు, నేను దీని గురించి మాట్లాడొద్దు. వాళ్ళ ముందు నేను చాలా చిన్న అబ్బాయిని. అంబర్పేట్ శంకర్ అంకుల్ లాంటి కొంత మంది తెలుసు. వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. అంతేకాని వాళ్ళని పెట్టుకొని నేను దంధా చేస్తునట్టు కాదు. హైదరాబాద్ నుండి వచ్చిన నేను సింగర్ గా ఎదగడంతో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. అంతే కానీ వాళ్ళని నేను తప్పుగా ఎప్పుడూ వాడుకోలేదు అంటూ చెప్పాడు.