Rahul Sipligunj : డెలివరీ బాయ్‌కి రాహుల్ సిప్లిగంజ్ లక్ష రూపాయల సాయం.. ఎందుకో తెలుసా?

తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ సింగర్ కి లక్ష రూపాయలు సాయం చేస్తామని ప్రకటించాడు.

Rahul Sipligunj : డెలివరీ బాయ్‌కి రాహుల్ సిప్లిగంజ్ లక్ష రూపాయల సాయం.. ఎందుకో తెలుసా?

Rahul Sipligunj announced one Lakh Rupees help to a Food Delivery Boy Video goes viral

Updated On : January 7, 2024 / 11:58 AM IST

Rahul Sipligunj : మన సెలబ్రిటీలు అంతా ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి సాయం చేసి అండగా నిలబడిన వాళ్ళే. ఇక కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అయితే ట్యాలెంట్ ఉండి కష్టాల్లో ఉన్న వాళ్లకి కచ్చితంగా ఎంతో కొంత సాయం చేస్తారు. తాజాగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ సింగర్ కి లక్ష రూపాయలు సాయం చేస్తామని ప్రకటించాడు.

స్టార్ మా ఛానల్ లో సూపర్ సింగర్ అనే ఓ ప్రోగ్రాం వస్తుంది. దేశమంతా జల్లెడ పట్టి తెలుగు పాటలు పాడే కొంతమంది అదిరిపోయే కొత్త సింగర్స్ ని తీసుకొచ్చి ఈ షో నడిపిస్తున్నారు. ఈ సూపర్ సింగర్ షోని శ్రీముఖి హోస్ట్ చేస్తుండగా జడ్జీలుగా అనంత్ శ్రీరామ్, శ్వేతా మోహన్, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీలు ఉన్నారు. తాజాగా ఈ షో నుంచి ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో కంటెస్టెంట్స్ మాస్ పాటలతో అదరగొట్టారు.

Also Read : Mirnaa Menon : అమ్మాయిలకు నాగార్జున మన్మధుడు.. కానీ ఆ హీరోయిన్‌కి మాత్రం అన్నయ్యంట.. పోస్ట్ వైరల్..

అయితే వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్.. దారి చూడు మామ దుమ్ము చూడు మామ.. అనే సాంగ్ తో జడ్జీలను మెప్పించాడు. అతని గురించి ఓ వీడియో షోలో ప్లే చేయగా అతను ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని, అతని కష్టాలని చూపించారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ అయి.. నేను కూడా ఒక బార్బర్ గా పని చేస్తూ మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చాను. కష్టాలు ఉండి కష్టపడి పైకి వచ్చేవాళ్ళ బాధ నాకు తెలుసు. అందుకే అతనికి మ్యూజిక్ నేర్చుకోవడానికి లక్ష రూపాయలు సాయం చేస్తాను అని ప్రకటించి ఎమోషనల్ అయ్యాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ని అతని అభిమానులు, పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)