రాహుల్ లిప్‌లాక్: సిగ్గుతో మొగ్గలేశారు.. వీడియో వైరల్..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నందినీ రాయ్‌ల లిప్‌లాక్ వీడియో వైరల్..

సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నందినీ రాయ్‌ల లిప్‌లాక్ వీడియో వైరల్..
రాహుల్ సిప్లిగంజ్.. టాలీవుడ్‌లో యంగ్ సింగర్‌గా ఆదరణ దక్కించుకున్నాడు. తెలుగు బిగ్‌బాస్-3 టైటిల్ గెలిచిన తర్వాత మనోడి క్రేజ్ కొండెక్కి కూర్చుంది. దీంతో అటు సింగర్‌గా, నటుడిగా, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో చాలా బిజీ అయిపోయాడు. ఇటీవల పబ్‌లో జరిగిన గొడవతో వార్తల్లో నిలిచాడు. తాజాగా రాహుల్ లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరేళ్ల కిందట బిగ్‌బాస్-2లో పార్టిసిపేట్ చేసిన నందినీ రాయ్‌తో కలిసి రాహుల్ ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేశాడు. ఈ పాటలో నందినీతో రోమాన్స్ చేయడంతో పాటు మాంచి లిప్ లాక్ సీన్ కూడా చేశాడు.
ఇప్పుడు ఆ వీడియోను రాహుల్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. రాహుల్, నందినీ ఇద్దరూ లిప్ టు లిప్ కిస్ ఇచ్చుకునే సీన్ చూసుకుని సిగ్గుతో కూడిన నవ్వు నవ్వుకున్న వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసి మరో బిగ్‌బాస్ ఫేమ్ అషూ రెడ్డి ‘వావ్ ఇది నేను చూడలే..’ అంటూ కామెంట్ చేసింది. ‘అబ్బో ఇక నేను చచ్చిపోతా’ అంటూ రాహుల్ రిప్లై ఇచ్చాడు.
దీనికి మళ్లీ స్పందించిన అషూ.. ‘మినిమమ్ ఉంటాయ్ కదా నీ వీడియోస్‌లో’ అంటూ లాఫింగ్ ఎమోజీ యాడ్ చేసింది. రాహుల్ ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంలో నటిస్తున్నాడు. మరాఠీ క్లాసిక్ ‘నటసామ్రాట్’ మూవీకిది తెలుగు రీమేక్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
View this post on Instagram
With this pretty lady @nandini.rai #throwbackmemories? #enduke #musicvideo #myfavorite