పొలిటికల్ బ్యాగ్రౌండ్‌తోనే రుబాబు చేశారు – ఔలాగాళ్ల గురించి మాట్లాడను భయ్యా…
తనపై జరిగిన దాడి గురించి మెదటిసారి మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్..

తనపై జరిగిన దాడి గురించి మెదటిసారి మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్..
హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్‌లో బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీర్ బాటిల్స్‌తో విచక్షణా రహితంగా రాహుల్‌పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు.
గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన రాహుల్ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తనపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కంప్లయింట్‌లో పేర్కొన్న రాహుల్.. తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ (మహిళలు) పై దాడిచేసి, అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.(మహళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు – పోలీసులకు రాహుల్ ఫిర్యాదు..)
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడాడు. రితేష్ రెడ్డి తనపై దాడి చేసాడని.. ఎనిమిది నుండి పదిమంది వరకు తనను కొట్టారని, పోలీసుల తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు మీడియాతో పంచుకున్నాడు రాహుల్..