Raj Kahani Trailer released by cinematography minister Talasani Srinivas Yadav
Raj Kahani Trailer : ప్రస్తుతం హీరోలు, దర్శకులు అన్న తేడా ఉండం లేదు. మంచి కథను రాసుకుని దర్శకులే నటిస్తున్నారు.. హీరోలే దర్శకులూ అవుతున్నారు. హీరో కమ్ డైరెక్టర్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అలానే ఇప్పుడు రాజ్ కహాని అనే సినిమాతో రాజ్ కార్తికేన్ హీరోగా, దర్శకుడిగా తన సత్తాను చాటేందుకు రెడీ అయ్యారు. భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలు గా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించారు.
Actress Hema: లిప్‌లాక్ వీడియోపై హేమ ఫైర్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!
మార్చి 24న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు వైవీఎస్ చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిథులుగా వచ్చారు. ట్రైలర్ బాగుందని చెబుతూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Pramod Kumar : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ పబ్లిసిటీ ఇన్చార్జి కన్నుమూత!
ట్రైలర్ చూస్తే కామెడీ, ఎమోషన్ సమపాళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాజ్ కహాని సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వబోతోన్నట్టుగా ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్‌లో ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం ప్లస్ అవుతుంది. యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఆయన విజువల్స్ ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సినిమాను మార్చి 24న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.