Raj Tarun – Lavanya : గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, రాజ్ నన్ను పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేసి కేసు పెట్టింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపారు.
దీనిపై రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి స్పందించి.. ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టి అనంతరం కనిపించకుండా మాయమయింది. గత కొన్ని రోజులుగా కనబడని రాజ్ తరుణ్ నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. రాజ్ తరుణ్ బయటకి వచ్చాడని తెలియడంతో మీడియాతో పాటు అనేకమంది ఈ ఈవెంట్ కి వచ్చారు.
Also Read : Raj Tarun : స్టేజిపై ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్.. నాకోసం శేఖర్ బాషా నిలబడ్డాడు..
ఈ ఈవెంట్లో లావణ్య వివాదం గురించి మీడియా ప్రశ్నించగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ఆరోపణలు చేసేవాళ్ళు బయట అలాగే మాట్లాడతారు. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతాను, ఆల్రెడీ ప్రొసీడ్ అవుతున్నాను. మీరు వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారు, కానీ ప్రూఫ్స్ చూపించట్లేదు. నేను ఆల్రెడీ మీడియాతో ఫస్ట్ ఎవ్వరు అడక్కుండానే వచ్చి మాట్లాడాను. అప్పుడు మాట్లాడిందే నిజం. నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను వేరే వాళ్లకు డ్యామేజీ చేయకూడదు అని వేరే వాళ్ళ పేర్లు బయట పెట్టలేదు. నాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేను దానికి సమాధానం ఇచ్చాను. నా తరపున లాయర్ హాజరయ్యారు. లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ లో గర్భస్రావంపై కేసు లేదు. అవి ఆరోపణలు మాత్రమే అని తెలిపారు.