Raj Tarun : స్టేజిపై ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్.. నాకోసం శేఖర్ బాషా నిలబడ్డాడు..

గత కొన్ని రోజులుగా కనబడని రాజ్ తరుణ్ నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు.

Raj Tarun : స్టేజిపై ఎమోషనల్ అయిన రాజ్ తరుణ్.. నాకోసం శేఖర్ బాషా నిలబడ్డాడు..

Raj Tarun says Thanks to RJ Shekar Bhasha and got Emotional on Stage

Updated On : July 31, 2024 / 4:09 PM IST

Raj Tarun : గత కొన్ని రోజులుగా హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ తో పదేళ్లకు పైగా కలిసి జీవించానని, రాజ్ నన్ను పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించాడని, హీరోయిన్ మాల్వి మల్హోత్రాని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆరోపణలు చేసి కేసు పెట్టింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ విషయంలో ఆల్రెడీ రాజ్ తరుణ్ కు నోటీసులు కూడా పంపారు.

దీనిపై రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి స్పందించి.. ఆమెతో నాకు ఎప్పుడో బ్రేకప్ అయింది, ఆమెవన్నీ అబద్దపు ఆరోపణలు అని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. మాల్వి మల్హోత్రా కూడా లావణ్యపై కేసు పెట్టి అనంతరం కనిపించకుండా మాయమయింది. గత కొన్ని రోజులుగా కనబడని రాజ్ తరుణ్ నేడు తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. రాజ్ తరుణ్ బయటకి వచ్చాడని తెలియడంతో మీడియాతో పాటు అనేకమంది ఈ ఈవెంట్ కి వచ్చారు.

Also Read : Raj Tarun : రాజ్‌త‌రుణ్‌ను నిల‌దీస్తానంటున్న లావ‌ణ్య‌..! ప్రసాద్ ల్యాబ్‌కు చేరుకున్న పోలీసులు..!

ఈ ఈవెంట్లో మొదట రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. నా జీవితంలో చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చాను అతనికి. కేవలం మూడు, నాలుగు సార్లే కలిసాను అతన్ని. కానీ నా కోసం శేఖర్ భాష నిలబడ్డాడు. నా కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను నీకు జీవితాంతం రుణబడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయి శేఖర్ భాషాను స్టేజిపైకి పిలిచి హగ్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపాడు.

రాజ్ తరుణ్ వివాదం మొదలయినప్పటినుంచి ఆర్జే శేఖర్ బాషా రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా నిల్చొని మాట్లాడాడు. లావణ్యపై పలు ఆరోపణలు చేసాడు. లావణ్య గురించి, లావణ్య – రాజ్ తరుణ్ మధ్య ఏం జరిగింది అని మాట్లాడాడు. దీంతో గత కొన్ని రోజులుగా శేఖర్ బాషా కూడా వైరల్ అవుతున్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ శేఖర్ భాషాకి థ్యాంక్స్ చెప్తూ ఎమోషనల్ అవ్వడంతో రాజ్ తరుణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.