×
Ad

Raja Saab Trailer: రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రాజా సాబ్ ట్రైలర్ డేట్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ (Raja Saab Trailer)సినిమా ఏదైనా ఉందంటే అది రాజా సాబ్ అనే చెప్పాలి.

Raja Saab trailer release date announced by the team

Raja Saab Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాల్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఏదైనా ఉందంటే అది రాజా సాబ్ అనే చెప్పాలి. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి రాజా సాబ్ సినిమాపై ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంచనాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, కెరీర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ హారర్ బ్యాక్డ్రాప్(Raja Saab Trailer) లో సినిమా చేస్తున్నాడు. ఇక హారర్ అండ్ కామెడీ కంటెంట్ తో హిట్ కొట్టడంలో మారుతీ బెస్ట్. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Upasana: ఢిల్లీలో బతుకమ్మ సంబరాలు.. ముఖ్యమంత్రితో ఆడిపాడిన మెగా కోడలు

ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్ లో సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవలే మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రూ.500 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇక తాజాగా దసరా పండుగ సందర్బంగా రాజా సాబ్ టీం ఫ్యాన్స్ కి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజా సాబ్ ట్రయిలర్ విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.

ఇక ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు. మరి కెరీర్ లో ఫస్ట్ టైం హారర్ అండ్ కామెడీ జానర్ సినిమా చేస్తున్న ప్రభాస్ కి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.