Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి సినిమాల కంటే ముందు ముంబైలో ఏం చేసేవాడో.. సీక్రెట్ చెప్పిన తెలుగు ఫేమస్ స్టాండప్ కమెడియన్..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజశేఖర్ మామిడన్న కాసేపు స్టాండప్ కామెడీ చేసి అలరించి అనంతరం నవీన్ గురించి మాట్లాడుతూ..

Raja Sekhar Mamidanna Telugu famous stand up comedian reveals secrets about Naveen Polishetty

Naveen Polishetty : యువ హీరో నవీన్ పోలిశెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి అనంతరం హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు(Jathi Rathnalu) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. త్వరలో అనుష్క(Anushka)తో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

నవీన్ తెలుగు సినిమాల్లోకి రాకముందే బాలీవుడ్(Bollywood) లో ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ హిందీలో కొన్ని సినిమాల్లో, యూట్యూబ్ లో నటించాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల యాక్టర్ గా ట్రై చేస్తూనే పలు పార్ట్ టైం జాబ్స్ కూడా చేశాడు. అయితే నవీన్ పలు ఇంటర్వ్యూలలో ముంబైలో(Mumbai) కష్టపడేవాడ్ని అని చెప్పాడు కానీ ఓ విషయం చెప్పలేదు. తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తెలుగు ఫేమస్ స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ మామిడన్న నవీన్ గురించి ఓ సీక్రెట్ రివీల్ చేశాడు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నవీన్ ఓ స్టాండప్ కమెడియన్ గా నటించాడు. దీంతో ప్రమోషన్స్ కోసం నిజమైన స్టాండప్ కమెడియన్ ని తీసుకొచ్చారు. రాజశేఖర్ మామిడన్న గత పదేళ్లుగా స్టాండప్ కామెడీ చేస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనే కాక ఇండియాతో పాటు విదేశాల్లో కూడా ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈయన షోలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు నవీన్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కోసం హైదరాబాద్ వచ్చి పెర్ఫార్మ్ చేశారు రాజశేఖర్ మామిడన్న.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజశేఖర్ మామిడన్న కాసేపు స్టాండప్ కామెడీ చేసి అలరించి అనంతరం నవీన్ గురించి మాట్లాడుతూ.. నవీన్ మీ అందరికి హీరోగానే తెలుసు. కానీ నాకు పదేళ్ల క్రితమే 2012 నుంచే తెలుసు. ముంబైలో బ్లూ క్రాస్ అని ఒక సంస్థ ఉంది. అక్కడ స్టాండప్ కామెడీ చేయడానికి వెళ్తుండేవాడిని. ఒకసారి అక్కడికి వెళ్లి ఇంకా ఎవరు రాకపోయేసరికి అక్కడున్న వాళ్ళని ఎవరన్నా స్టాండప్ కామెడీ చేయడానికి వచ్చారా అని అడిగితే ఒకడు వచ్చాడు అని దూరంగా నవీన్ ని చూపించారు. అప్పుడు మా ఇద్దరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ముంబై మెట్రోలో తిరుగుతూ మా భాధలు అన్ని చెప్పుకున్నాం. ఇక నవీన్ ఇలా హీరో అయిపోయాడు, నేను స్టాండప్ కామెడియన్ అయ్యాను. నవీన్ ఇలా సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని తెలిపారు.

RX 100 Sequel : ‘ఆర్‌ఎక్స్‌100’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరో కార్తికేయ.. ఉంటుందా? లేదా?

దీంతో నవీన్ హీరో అవ్వకముందు స్టాండప్ కమెడియన్ గా కూడా చేశాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే సినిమాలో స్టాండప్ కమెడియన్ గా మరింత బాగా నటించి ఉంటాడు అని భావిస్తున్నారు. ఇపుడు నవీన్ గురించి స్టాండప్ కమెడియన్ రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.