Rajamouli – Ram Charan : చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కోసం రాబోతున్న దర్శక ధీరుడు.. రేపే ట్రైలర్ లాంచ్..

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

Rajamouli as Chief Guest for Ram Charan Game Changer Trailer Launch Event

Rajamouli – Ram Charan : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వచ్చి ఫుల్ ట్రెండ్ అయ్యాయి. సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నేడు ఉదయం గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ ట్రైలర్ రేపు జనవరి 2 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రానుంది.

Also See : Mega Cousins : అడవిలో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ‘మెగా’ కజిన్స్..

అయితే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా చేద్దామనుకున్నారు కానీ ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ అల్లు అర్జున్ ఘటన, ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులతో సింపుల్ ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ఓ మల్టిప్లెక్స్ థియేటర్ లో సింపుల్ గా ఈ ట్రైలర్ లాంచ్ ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు చరణ్, శంకర్, దిల్ రాజు, SJ సూర్యతో పాటు పలువురు మూవీ టీమ్ హాజరుకానున్నారు.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో చరణ్ మగధీర, RRR సినిమాలు చేసి భారీ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, నవీన్ చంద్ర, SJ సూర్య.. పలువురు స్టార్స్ నటిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా తెలుగు, తమిళ్, హిందీలోనే రిలీజ్ కానుంది. తమిళ్ లో సంక్రాంతికి పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో గేమ్ ఛేంజర్ కి బాగా కలిసి రానుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Also Read : CM Chandrababu : సినీ పరిశ్రమపై సీఎం చంద్రబాబు కామెంట్స్.. సినీ పరిశ్రమకు హబ్ హైదరాబాద్..