CM Chandrababu : సినీ పరిశ్రమపై సీఎం చంద్రబాబు కామెంట్స్.. సినీ పరిశ్రమకు హబ్ హైదరాబాద్..

తాజాగా సీఎం చంద్రబాబు సినీ పరిశ్రమపై కామెంట్స్ చేసారు.

CM Chandrababu : సినీ పరిశ్రమపై సీఎం చంద్రబాబు కామెంట్స్.. సినీ పరిశ్రమకు హబ్ హైదరాబాద్..

CM Chandrababu Interesting Comments on Film Industry

Updated On : January 1, 2025 / 7:49 PM IST

CM Chandrababu : గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమ వార్తల్లో నిలుస్తుంది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ పెద్దలు వెళ్లి సీఎం రేవంత్ ని కలిసిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం, హైదరాబాద్ లో సినిమా అభివృద్ధి కోసం మాట్లాడమని FDC చైర్మన్ దిల్ రాజు ఈ మీటింగ్ తర్వాత తెలిపారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ ఏపీకి వెళ్తుందని వార్తలు కూడా వచ్చాయి.

Also Read : Anurag Kashyap : కూతురి పెళ్లి ఖర్చు కోసం ఇబ్బంది పడిన స్టార్ దర్శకుడు.. డబ్బుల కోసం నటుడిగా..

పవన్ తో పాటు పలువురు ఏపీ నాయకులు కూడా సినీ పరిశ్రమకు స్వాగతం పలికారు. ఏపీలో మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకోండి అని చెప్పారు. దీంతో టాలీవుడ్ లో ఏపీకి సినీ పరిశ్రమపై చర్చ మొదలయింది. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం పరిశ్రమ ఎక్కడికి వెళ్ళదు అని అన్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు సినీ పరిశ్రమపై కామెంట్స్ చేసారు.

నేడు న్యూ ఇయర్ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ మీట్ లో ఏపీలోని పరిస్థితులు, గత ప్రభుత్వం చేసిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడారు. అనేక రంగాల పరిస్థితి గురించి మాట్లాడారు.

Also Read : Brahmanandam : కొడుకుతో బ్రహ్మానందం సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే.. న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్..

అలాగే సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. సినిమాకు హైదరాబాద్ ఇప్పుడు హబ్ గా మారింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అవకాశాల వల్లే ఇది సాధ్యమయింది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ కూడా సినిమాకు బాగా పెరిగింది. ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం దేని మీద ఫోకస్ చేయాలో దాని మీదే చేస్తాం. ఏపీలో ఉన్న సమస్యలు తీర్చి అభివృద్ధి మీద దృష్టి పెట్టాం. ప్రస్తుతం సినిమా గురించి అంత అవసరం లేదు. అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే. అమరావతిలో సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది అని అన్నారు.

దీంతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై ఎవరైనా టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తారా చూడాలి.