Anurag Kashyap : కూతురి పెళ్లి ఖర్చు కోసం ఇబ్బంది పడిన స్టార్ దర్శకుడు.. డబ్బుల కోసం నటుడిగా..
ఈ డైరెక్టర్ కూతురు అలయా కశ్యప్ పెళ్లి ఆమె ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో ఘనంగా జరిగింది.

Anurag Kashyap Sensational Comments on Marriages and his Financial Status
Anurag Kashyap : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన డిఫరెంట్ సినిమాలతోనే కాక నటుడిగా కూడా పలు సినిమాలతో మెప్పించాడు. ఇటీవలే ఈ డైరెక్టర్ కూతురు అలయా కశ్యప్ పెళ్లి ఆమె ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో ఘనంగా జరిగింది. ఈ పెళ్లిని తన కూతురు కోరుకున్నట్టు అనురాగ్ కశ్యప్ గ్రాండ్ గా చేసాడు. ఈ పెళ్లి తర్వాత అనురాగ్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో వరుసపెట్టి సంచలన కామెంట్స్ చేస్తున్నాడు.
Also See : Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ న్యూ ఇయర్ స్పెషల్ స్టైలిష్ లుక్స్ చూశారా?
ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ ఇటీవల పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. ఇటీవల పెళ్లి ఖర్చులు కొన్ని చిన్న సినిమాల బడ్జెట్ లకు సమానంగా ఉన్నాయి. నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ పెళ్లి ఖర్చుల కోసం నేను ఫుల్ టైం నటుడిగా మారాను. నా కూతురు పెళ్లి ముఖ్యమైన ఘట్టం. ఆ పెళ్లి నేను జరిపించాలి. ఇప్పుడు పెళ్లి అయిపోయింది కాబట్టి నేను నటుడిగా నా కెరీర్ మీద దృష్టి పెడతాను అని అన్నారు. దీంతో అనురాగ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అనురాగ్ గతంలో హిందీతో పాటు పలు తమిళ్, మలయాళం సినిమాల్లో నటుడిగా నటించారు. అనురాగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలతో తన కూతురు పెళ్లి కోసం అప్పు చేయాల్సి వచ్చిందని, కూతురు అడిగిందని బాగా ఖర్చుపెట్టాడని తెలుస్తుంది. దీంతో కొన్నాళ్ల పాటు దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి డబ్బుల కోసం, తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కోసం సౌత్ కి వచ్చి నటుడిగా మారతాడని తెలుస్తుంది.
Also Read : Brahmanandam : కొడుకుతో బ్రహ్మానందం సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే.. న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్..
అలాగే అనురాగ్ కశ్యప్ మరో ఇంటర్వ్యూలో.. బాలీవుడ్ లో ఎవరూ సినిమాల గురించి ఆలోంచించట్లేదు. కేవలం డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు. వీళ్ళు మంచి సినిమాలు ఇప్పుడు తీయట్లేదు. రీమేక్ చేద్దామని ట్రై చేస్తున్నారు. పుష్ప లాంటి సినిమా అయితే బాలీవుడ్ తీయలేదు. అందుకే నేను బాలీవుడ్ వదిలేసి సౌత్ కి వెళ్ళిపోతాను అని అన్నారు.