rajamouli
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ విజయాలు గురించి మాట్లాడుకొని మనందరికి అలుపు వస్తుంది. కానీ సినిమా మాత్రం ఒక దాని తరువాత మరొక రికార్డు క్రియేట్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డుల వేదికల్లో సత్తా చాటిన ఈ సినిమా.. ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. ఇక నిన్న ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్’ అవార్డుల్లో కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి అవార్డుని అందుకున్నాడు.
తాజాగా హాలీవుడ్ ప్రముఖ పురస్కారం ‘క్రిటిక్స్ ఛాయస్ అవార్డు’ని కూడా కైవసం చేసుకుంది. ఈ అవార్డుల రేస్ లో ఆర్ఆర్ఆర్ సినిమా పలు కేటగిరీలో నామినేట్ అయ్యింది. అయితే ఈ నామినేషన్స్ లో ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో అవార్డులను అందుకున్నారు రాజమౌళి, ఎం ఎం కీరవాణి. ఇక ఈ అవార్డుల వేడుకల్లో పాల్గొని, అవార్డుని అందుకున్న కీరవాణి, రాజమౌళి తమ విజయాలను తమ జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులకు అంకితం చేశారు.
ఈ క్రమంలోనే రాజమౌళి తన విజయాన్ని తన జీవితంలోని ఆడవారికి అంకింతం చేస్తూ.. ‘మా అమ్మ రాజనేంద్రి నాలోని క్రియేటివిటీని గుర్తించి సినిమా వైపు ప్రయాణించడానికి సహాయ పడింది. ఆ తరువాత మా వదిన శ్రీవల్లి (కీరవాణి భార్య) నాకు మరో అమ్మలా ఉంటూ, నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వస్తుంది. నా భార్య రామా.. ఆమె కేవలం నా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ మాత్రమే కాదు, నా జీవితానికి కూడా డిజైనర్. ఇక నా కూతుళ్లు.. వాళ్ళు ఏమి చేయనక్కరలేదు, కేవలం వాళ్ల నవ్వు చాలు. చివరిగా నన్ను కన్న నా భారతదేశం. మేరా భారత్ మహాన్ జై హింద్’ అంటూ మాట్లాడిన మాటలు అందరి చేత చప్పట్లు కొట్టించాయి.
RRR won the BEST FOREIGN LANGUAGE FILM award at the #CritcsChoiceawards ??????
Here’s @ssrajamouli acceptance speech!!
MERA BHARATH MAHAAN ?? #RRRMovie pic.twitter.com/dzTEkAaKeD
— RRR Movie (@RRRMovie) January 16, 2023