Rajamouli : మలయాళ నటులు గొప్ప యాక్టర్స్.. అందుకు బాధపడుతున్నా అంటున్న రాజమౌళి..

మలయాళ నటులు గొప్ప యాక్టర్స్, అందుకు బాధపడుతున్నా అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Rajamouli feeling sad about malayalam film industry always produce great actors

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మారి మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమలు’ను డబ్బింగ్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఇటీవల రిలీజైన ఈ చిత్రం.. తెలుగులో కూడా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ తెలుగు సక్సెస్ మీట్ ని రాజమౌళి గెస్ట్ గా చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. మలయాళ నటులు గొప్ప యాక్టర్స్, అందుకు బాధపడుతున్నా అంటూ వ్యాఖ్యానించారు.

రాజమౌళి మాటలు.. “కొంచెం జెలసితో, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిలిం ఇండస్ట్రీ గొప్ప నటులను ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వారంతా చాలా బాగా నటిస్తారు. అలాగే ఈ సినిమాలో నటించిన నస్లెన్ గఫూర్, మమిత బైజు, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్ తమ నటనతో అదరగొట్టేసారు. మేము యాక్షన్ సీన్స్ తో చాలా కష్టపడుతుంటాము. కానీ వీళ్ళు చిన్న ఎక్స్‌ప్రెషన్ తో థియేటర్స్ లో విజుల్స్ అందుకుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.

Also read : Hanuman : కేంద్రమంత్రి అమిత్ షాతో.. ‘హనుమాన్’ టీం భేటీ..

ఈ మూవీలోని ప్రతి పాత్రని మన లైఫ్ లో చూస్తూనే ఉంటాము. అలాంటి పాత్రలను చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేసారని పేర్కొన్నారు. ఇక హీరోయిన్ గా చేసిన మమిత.. గీతాంజలి సినిమాలోని ‘గిరిజ’ని, ఆ తరువాత వచ్చిన ‘సాయి పల్లవి’ని గుర్తు చేసిందని చెప్పుకొచ్చారు.

అలాగే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసిన ఆదిత్య హాసన్ ని అభినందించారు. ఈ మూవీ తెలుగులో సూపర్ హిట్ అవ్వడం పట్ల మొదటి క్రెడిట్ ని ఆదిత్యకే ఇవ్వాలంటూ చెప్పుకొచ్చారు. మలయాళంలో డైలాగ్స్ గురించి తనకి తెలియదు గాని, తెలుగు డైలాగ్స్ కి మాత్రం తాను బాగా ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఆదిత్య హాసన్ మరెవరో కాదు.. ఇటీవల సూపర్ హిట్టైన #90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన దర్శకుడు.

ట్రెండింగ్ వార్తలు