Rajamouli – Mahesh Babu : శివరాత్రి రోజు మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న రాజమౌళి.. నిజమేనా.. ఫ్యాన్స్ వెయిటింగ్..

అభిమానుల కోసం శివరాత్రి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట రాజమౌళి. దానికి సంబంధించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది.

Rajamouli Giving Surprise to Mahesh Babu Fans on Shivaratri about SSMB29

Rajamouli – Mahesh Babu : రాజమౌళి మహేష్‌ బాబు కాంబో మూవీ కోసం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ వెయిట్‌ చేస్తోంది. ముహూర్తం నుంచి షూటింగ్‌ వరకు అంతా సీక్రెట్‌గా మెయింటేన్‌ చేస్తున్నాడు జక్కన్న. దీంతో ఒక్క అప్డేట్‌, ఒకే ఒక్క అప్డేట్ అంటూ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దీంతో అభిమానుల కోసం శివరాత్రి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట రాజమౌళి. దానికి సంబంధించి ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది.

భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్‌ మూవీగా మారే చాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్న రాజమౌళి, మహేష్ సినిమా ఈ మధ్యే సెట్స్ మీదికి వెళ్లింది. మూవీ ఎప్పుడో అనౌన్స్ చేసినా షూటింగ్ మొదలుకావడానికి చాలా టైమ్‌ పట్టింది. ముహూర్త వేడుకను సీక్రెట్‌గా చేసిన చిత్ర బృందం సినిమా మొదలైనట్లు అధికారికంగా కూడా అనౌన్స్‌ చేయలేదు. ఇక మూవీ గురించి ఇప్పటివరకు ఒక్క అప్‌డేట్‌ కూడా లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.

Also Read : Manchu Lakshmi : అవును మా భర్త, నేను దూరంగానే ఉంటున్నాం.. కానీ.. మంచు లక్ష్మి కామెంట్స్.. మోహన్ బాబుపై వచ్చిన ఆరోపణలు అబద్దమేనా..

నిజానికి షూటింగ్ వెళ్లడానికి ముందే ఓ ప్రెస్‌మీట్ పెట్టి బేసిక్ స్టోరీ లైన్ కూడా చెప్పేయడం జక్కన్నకు అలవాటు. అయితే మహేష్‌ మూవీ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. ఇప్పుడు శివరాత్రి రోజు మహేష్ ఫ్యాన్స్‌కు సూపర్‌ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడట. తన మార్క్ ప్రెస్‌మీట్ పెట్టబోతున్నాడట.

ప్రస్తుతం జక్కన్న, మహేష్‌ మూవీ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోందని టాక్‌. ఈ షెడ్యూల్ పూర్తవడానికి వచ్చిందని, దీంతో ప్రెస్‌మీట్ పెట్టడానికి రాజమౌళి సిద్ధం అవుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రి సందర్భంగా ఈ ప్రెస్‌మీట్‌ కండక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రెస్‌మీట్‌తో పాటు చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశాడట రాజమౌళి. సినిమాకు సంబంధించి అనేక విషయాలు చెప్పే చాన్స్ ఉంటుంది అంటున్నారు.

Also Read : Thandel Success Party : నాగచైతన్య సాయి పల్లవి ‘తండేల్’ సక్సెస్ పార్టీ.. తరలి వచ్చిన సినీ పరిశ్రమ.. ఫొటోలు చూశారా?

ఈ ప్రెస్ మీట్ లో స్టోరీ లైన్ కూడా చెప్తారట. టైటిల్ రివీల్‌ చేసే అవకాశం కూడా ఉందనే టాక్ నడుస్తోంది. కాస్ట్ అండ్ క్రూ ఎవరనేది కూడా రివీల్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక పాన్ వరల్డ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈసారి టైటిల్ ప్లాన్ చేశారట. దీంతో ఈ ప్రెస్‌మీట్ గాసిప్‌తో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది. ఏం చెప్తారా, టైటిల్ ఏంటా అని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఫారెస్ట్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.