rajamouli interesting comments on mahesh babu project
Rajamouli : ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి వరల్డ్ వైడ్ గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఇండియన్ ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. నిజం చెప్పాలి అంటే ఈ చిత్రాన్ని భారతీయులు కంటే విదేశీలే ఎక్కువ ఓన్ చేసుకున్నారు. అక్కడ ఆడియన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ తో ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డుల వేదికల్లో చోటు దక్కించుకున్న ఈ సినిమా.. హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి అవార్డులను కూడా సొంతం చేసుకుంటుంది.
Rajamouli : తన గెలుపుని తన జీవితంలోని ఆడవారికి అంకింతం చేసిన రాజమౌళి..
ఆస్కార్ తరువాత అత్యున్నత పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో హాలీవుడ్ గడ్డ పై మరెంత క్రేజ్ ని సంపాదించుకుంది. దీంతో పలు హాలీవుడ్ మీడియా ప్రతినిధులు RRR టీంని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తన తదుపరి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ తరువాత అనుకున్నది కాదట.
ఈ ప్రాజెక్ట్ 10 ఏళ్ళ క్రిందటే కన్‌ఫార్మ్ అయ్యిందట. కథని మెరుగు దిద్దడంలో సినిమా పెండింగ్ పడుతూ వచ్చినట్లు వెల్లడించాడు. కేవలం కథ విషయంలోనే కాదు, ఎలా తియ్యాలి అనే విషయంలో కూడా చాలా సందేహాలు ఉండడంతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాను CAA వాళ్లతో సైన్ ఇన్ అయ్యినట్లు తెలియజేశాడు. వాళ్ళు ఇప్పటి వరకు అన్ని హాలీవుడ్ సినిమాలే తెరకెక్కించారు. దీంతో ఇండియన్ స్టైల్ అఫ్ మేకింగ్ అర్ధం చేసుకోడానికి చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సినిమా మొదలు కావడానికి ఇంకొంచెం సమయం పడుతుంది అంటూ వెల్లడించాడు.
కాగా ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ అడ్వెంచర్ గా తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు కి పూర్తి కానుంది. ఆ తరువాత నుంచి కంప్లీట్ రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవ్వనున్నాడు రాజమౌళి.
. @ssrajamouli garu About the Globe Trotting #SSMB29. @urstrulyMahesh pic.twitter.com/We649SaPhl
— Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) January 18, 2023