Rajamouli Interesting Comments on Mahesh Babu SSMB29 Movie in Japan Comments goes Viral
Rajamouli : RRR ఆస్కార్ అవార్డు సాధించడంతో రాజమౌళి పేరు ప్రపంచమంతా పాకింది. పలు దేశాల్లో RRR సినిమాతో రాజమౌళికి కూడా భారీగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక జపాన్ లో అయితే తెలుగు సినిమాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలను ఇక్కడి ఫ్యాన్స్ ట్రీట్ చేసినట్టే గ్రాండ్ గా ట్రీట్ చేస్తున్నారు జపాన్ లో. తాజాగా RRR సినిమా జపాన్ లో రీ రిలీజ్ అవ్వడంతో రాజమౌళి అక్కడికి వెళ్లారు.
రాజమౌళికి అక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఎంతోమంది అభిమానులు రాజమౌళిని కలవడానికి వచ్చారు. అక్కడి అభిమానులు రాజమౌళికి చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. దీనిపై రాజమౌళి, RRR యూనిట్ కూడా ఎమోషనల్ పోస్ట్స్ చేసారు. ఇక రీ రిలీజ్ లో, అది కూడా జపాన్ లో RRR థియేటర్స్ అన్ని ఫుల్ అయ్యాయి. సినిమా అనంతరం రాజమౌళి అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా గురించి కూడా మాట్లాడాడు.
Also Read : Devara Shoot : ఎన్టీఆర్ ‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్.. ఎక్కడో తెలుసా?
రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం అభిమానులతో పాటు, సినీ ప్రేమికులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా జపాన్ లో రాజమౌళి మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా రైటింగ్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా కాస్టింగ్ ఎవర్ని ఫైనల్ చేయలేదు ఒక్క మెయిన్ హీరో తప్ప. అతని పేరు మహేష్ బాబు, చాలా అందంగా ఉంటాడు, తెలుగు యాక్టర్. మీకు కూడా తెలిసే ఉంటుంది. త్వరలోనే సినిమా మొదలవ్వనుంది. సినిమా రిలీజ్ టైంకి అతన్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను అని అన్నారు. దీంతో రాజమౌళి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.