Devara Shoot : ఎన్టీఆర్ ‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్.. ఎక్కడో తెలుసా?

ఎన్టీఆర్, జాన్వీపై ఓ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది.

Devara Shoot : ఎన్టీఆర్ ‘దేవర’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్.. ఎక్కడో తెలుసా?

NTR Devara Movie next Schedule Shooting Starts

Updated On : March 19, 2024 / 7:59 AM IST

Devara Shoot : ఎన్టీఆర్(NTR) దేవర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. శ్రీకాంత్, షైన్ చామ్ టాకో.. పలువురు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

దేవర సినిమా సముద్రం ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్రపు దొంగల కథాంశంతో ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే దేవర షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాయి. గోవా, గోకర్ణ, రామోజీ ఫిలిం సిటీ.. వంటి ప్లేస్ లలో షూటింగ్ చేశాయి. దేవర సముద్రపు ఒడ్డున జరిగే కథ కావడంతో ఎక్కువగా సముద్రవు ఒద్దు ఉన్న ప్లేసెస్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి మొదలు కాబోతుంది. గోవాలో దేవర నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ నేటి నుంచి జరగనుందని సమాచారం.

Also Read : Anupama Parameswaran : బోర్ కొట్టి ‘టిల్లు స్క్వేర్’లో బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నా.. ఇలాంటి క్యారెక్టర్‌ని వదులుకుంటే నేను స్టుపిడ్‌ని..

ఎన్టీఆర్, జాన్వీపై ఓ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఈ షూట్ కోసం నిన్న సాయంత్రమే ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గోవాకు వెళ్లారు. ఇక దేవర సినిమా నుంచి మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఓ పాట రిలీజ్ చేస్తారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గోవాకు వెళ్తున్న ఫోటో వైరల్ గా మారింది. రెడ్ టీ షర్ట్ వేసుకొని ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనపడ్డాడు.

NTR Devara Movie next Schedule Shooting Starts