Anupama Parameswaran : బోర్ కొట్టి ‘టిల్లు స్క్వేర్’లో బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నా.. ఇలాంటి క్యారెక్టర్‌ని వదులుకుంటే నేను స్టుపిడ్‌ని..

'టిల్లు స్క్వేర్'లో టీజర్, ట్రైలర్స్ లోనే రొమాంటిక్, కిస్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో కూడా మరింత బోల్డ్ గా అనుపమ కనిపించనుంది. దీంతో అనుపమ ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు.

Anupama Parameswaran : బోర్ కొట్టి ‘టిల్లు స్క్వేర్’లో బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్నా.. ఇలాంటి క్యారెక్టర్‌ని వదులుకుంటే నేను స్టుపిడ్‌ని..

Anupama Parameswaran Comments on her Bold Character in Tillu Square Movie

Updated On : March 19, 2024 / 7:16 AM IST

Anupama Parameswaran : డీజే టిల్లుకి సీక్వెల్ గా సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్(Till Square). ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయి అంచనాలు పెంచాయి. డీజే టిల్లు లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడూ లేనంతగా బోల్డ్ క్యారెక్టర్ చేసింది.

టీజర్, ట్రైలర్స్ లోనే రొమాంటిక్, కిస్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో కూడా మరింత బోల్డ్ గా అనుపమ కనిపించనుంది. దీంతో అనుపమ ఫ్యాన్స్, ప్రేక్షకులు షాక్ అయ్యారు. నార్మల్ పాత్రలు చేసి, అసలు బోల్డ్ క్యారెక్టర్, కిస్ సీన్స్ లేకుండా చేసిన అనుపమ గత సినిమా రౌడీ బాయ్స్ లో కిస్ సీన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక టిల్లు స్క్వేర్ లో దానికి మించి సీన్స్ ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Akshara Gowda : ఇంటర్వ్యూ మధ్యలో సడెన్‌గా హీరోయిన్‌కి ముద్దు పెట్టిన యాంకర్.. సీరియస్ అయిన హీరో..

తాజాగా నిన్న టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఓ బ్రేకప్ సాంగ్ రిలీజ్ అవ్వగా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా ప్రతినిధులు అనుపమని ఈ బోల్డ్ సీన్స్ గురించే ప్రశ్నించారు. దీనికి అనుపమ సమాధానమిస్తూ.. ఇన్నాళ్లు ఒకే సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశాను. ఎప్పుడూ ఒకే క్యారెక్టర్స్ చేస్తే బోర్ కొడుతుంది. ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ వదులుకుంటే నేను స్టుపిడ్ ని. నాకు కూడా డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. అంతేకాకుండా ఒక నటిగా డైరెక్టర్ ఏం చెప్పినా చేస్తాను. అందుకే ఈ సినిమా, ఆ సీన్స్ చేశాను, లైఫ్ లో కొత్తదనం ఉండాలి అంటూ ఉదాహరణలు చెప్పి మరీ సమాధానం ఇచ్చింది. అలాగే.. ఇలాంటి పాత్రలు చేస్తే ఎందుకు చేస్తున్నారు అని మీరే రాస్తారు. చెయ్యకపోతే కొత్తగా ట్రై చేయట్లేదేంటి అని మీరే అంటారు. ఇలా అయితే నేను ఇంకేమి చేయాలి అని కౌంటర్ కూడా ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Aakashavaani (@theaakashavaani)