Rajamouli is preparing the story for the RRR sequel
ఆర్ఆర్ఆర్ : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఫ్రీ ఇండిపెండెన్స్ మూవీ “ఆర్ఆర్ఆర్”కు సీక్వెల్ ఉండబోతుందంట. ఎన్టీఆర్ – కొమరం భీమ్ గా, రామ్ చరణ్ – అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ ముల్టీస్టార్రర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలయ్యి నెల్లలు గడుస్తున్నా RRR మ్యానియా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవలే జపాన్ లో కూడా విడుదలయిన ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది.
Ram Charan-Akshay Kumar : రామ్ చరణ్, అక్షయ్ కుమార్ ఒకే వేదికపై..
ఇక ఈ సినిమా ఆస్కార్ రేస్ లో నిలవగా, దర్శకుడు రాజమౌళి సినిమా కాంపెయిన్ చేస్తూ అమెరికాలోని పలు ప్రముఖ నగరాల్లో తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే చికాగోలో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కి హాజరయిన జక్కన, ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో సినిమా సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అన్ని సినిమాలకు తన తండ్రి విజయంద్రప్రసాద్ కథలు అందిస్తారని తెలియజేసిన రాజమౌళి.. సీక్వెల్ కి కూడా కథ సిద్ధం అవుతున్నట్లు వెల్లడించాడు.
“నా హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ సినిమా మ్యానియా నుంచి బయటపడి, ఇతర ప్రాజెక్ట్ లో బిజీ అవుతున్నారు. కానీ నేను ఇప్పటికి అది సృష్టించిన ప్రభంజనంలోనే ఉన్నాను. వరల్డ్ వైడ్ గా RRR కి వస్తున్న క్రేజ్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక రాజమౌళి నుంచి ఈ వార్త విన్న నందమూరి-మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.