Ram Charan : RC 15 గురించి శంకర్ సర్‌ని అడగండి.. నాకు కూడా ఏమి తెలీదు.. త్వరలో న్యూజిలాండ్‌కి సాంగ్ షూట్‌కి వెళ్తున్నాము..
సినిమాల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ అడగ్గా చరణ్.. ''ప్రస్తుతం శంకర్ సర్ సినిమాలో నటిస్తున్నాను. RC 15 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అప్డేట్...........

Ram Charan comments on RC 15 Movie under Shankar Direction
Ram Charan : RRR సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. నార్త్ లో కూడా చరణ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు RRR సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసి ఇటీవలే ఇండియాకి వచ్చాడు.
తాజాగా రామ్ చరణ్ ఢిల్లీలో నిర్వహించిన హిందుస్థాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ సమ్మిట్ కి సౌత్ నుంచి కేవలం రామ్ చరణ్ ని మాత్రమే ఆహ్వానించడం విశేషం. అలాగే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ ని ఆహ్వానించారు. రామ్ చరణ్, అక్షయ్ కుమార్ లు ఒకే వేదికపై సందడి చేశారు. వీరిద్దర్నీ వేదికపై పలు ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. అక్షయ్, రామ చరణ్ కూడా పలు అంశాల గురించి ఆసక్తిగా మాట్లాడారు. ఇక వీరిద్దరూ కలిసి తెలుగు, హిందీ పాటలకి డ్యాన్సులు వేసి అదరగొట్టారు.
సినిమాల గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి అప్డేట్ అడగ్గా చరణ్.. ”ప్రస్తుతం శంకర్ సర్ సినిమాలో నటిస్తున్నాను. RC 15 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అప్డేట్ నాకేమి తెలియదు శంకర్ సర్ ని అడగాలి. నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను. జస్ట్ సెట్స్ కి వెళ్లి షూట్ చేసి వచ్చేస్తున్నాను. శంకర్ సర్ ఏది చెప్తే అది చేస్తున్నాను. త్వరలో న్యూజిలాండ్ కి సాంగ్ షూట్ కి వెళ్ళబోతున్నాము” అని తెలిపారు.