Rajamouli listed in Times most power full people in World
Rajamouli : బాహుబలి(Bahubali) సినిమాతోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించి మన తెలుగు(Telugu) చిత్రసీమకు కూడా పేరు తెచ్చారు రాజమౌళి(Rajamouli). ఆ తర్వాత RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చి ఇండియన్ సినిమాని, ముఖ్యంగా తెలుగు సినిమాని ఆస్కార్(Oscar) దాకా తీసుకెళ్లి గెలిచి వచ్చారు. ఇప్పుడు రాజమౌళి ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే చాలా పాపులర్ డైరెక్టర్(Director). రాజమౌళికి మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు.
ఇక హాలీవుడ్ లో టాప్ ఫిలింమేకర్స్ సైతం రాజమౌళి డైరెక్షన్ కి ఫిదా అయ్యారు. రాజమౌళి RRR ప్రమోషన్స్ లో హాలీవుడ్ లో ఉన్నప్పుడు అనేకమంది హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ రాజమౌళిని అభినందించారు. తాజాగా రాజమౌళి ఓ అరుదైన ఘనతని సాధించాడు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ ఇస్తుంది. ఇందులో చోటు దక్కాలని చాలా మంది కోరుకుంటారు.
తాజాగా 2023 సంవత్సరానికి టైమ్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల లిస్ట్ ని రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ఇండియా నుంచి కేవలం ఇద్దరికీ మాత్రమే చోటు దక్కడ విశేషం. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, హాలీవుడ్ స్టార్స్, మెస్సి, ఎలాన్ మస్క్.. లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఉన్న ఈ లిస్ట్ లో ఇండియా నుంచి రాజమౌళి, షారుఖ్ ఖాన్ చోటు సంపాదించుకున్నారు.
Samantha : సమంతకు విజయ్ దేవరకొండ లేఖ.. ఏమని రాశాడో తెలుసా?
టైమ్స్ లిస్ట్ లో చోటు సంపాదించిన మొదటి ఇండియన్ డైరెక్టర్ గా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించారు. తన RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి గత కొద్ది కాలంగా రాజమౌళి బాగా ఫేమస్ అయ్యారు. అనేక దేశాల్లో రాజమౌళికి అభిమానులు ఏర్పడ్డారు. దీంతో టైమ్స్ 100 లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించారు. ఈ లిస్ట్ లో రాజమౌళి చోటు సంపాదించడంతో అభిమానులు, నెటిజన్లు. పలువురు ప్రముఖులు రాజమౌళిపై అభినందనలు కురిపిస్తున్నారు.
Congratulations to the pride of Indian cinema, @SSRajamouli, the first Indian filmmaker to be named one of @TIME‘s 100 most influential people in the world. ??#SSRajamouli #TIME100 #RRRMovie pic.twitter.com/TOrOJYdi7T
— DVV Entertainment (@DVVMovies) April 13, 2023
See every member of the 2023 #TIME100 list https://t.co/HGiGuvuhLI pic.twitter.com/FQNZv7vRkn
— TIME (@TIME) April 13, 2023