Rajamouli
Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు సినిమా టైటిల్ వారణాసి అని నిన్న భారీ ఈవెంట్ పెట్టి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపారు. అసలు సినిమా టైటిల్ కోసం ఈ రేంజ్ ఈవెంట్ ని రాజమౌళి ఎప్పుడూ పెట్టలేదు. అసలు రాజమౌళి తెలుగులో ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎప్పుడూ చేయలేదు. గతంలో RRR సమయంలో కూడా బాలీవుడ్ లో చేసారు కానీ ఇక్కడ ఈ రేంజ్ ఈవెంట్స్ చేయలేదు. బాహుబలి 2 సమయంలో కూడా ఒకటే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు అంతే.(Rajamouli)
రాజమౌళి – మహేష్ సినిమాకు సాయి దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి ఈ సినిమా గురించి ఓ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే పెరిగిందని, అంత బడ్జెట్ నిర్మాత నారాయణ పెట్టలేకపోతున్నారని, అందుకే రాజమౌళిని తాను నిర్మాతగా మారి డబ్బులు తీసుకొస్తున్నట్టు టాక్ వచ్చింది.
Also Read : Jyothi : ఇంకో జన్మ ఉంటే ఆయనే నా హస్బెండ్ గా రావాలి.. నా కొడుకుని చూసి పవన్ ఏమన్నారంటే..
నిన్న జరిగిన వారణాసి ఈవెంట్లో రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా మాట్లాడాడు. దీంతో దీనిపై మరింత క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు KL నారాయణ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వగా యిప్పుడు రాజమౌళి ఇన్వెస్టర్స్ ని, ఫైనాన్షియర్స్ తెప్పించి ఈ సినిమాకు డబ్బులు పెట్టిస్తున్నారని అందుకే నిర్మాతగా తన కొడుకు పేరు వేశారని అంటున్నారు. సినిమాకు హైప్ తెప్పించి, జనాలు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో చూపించి సినిమా నిర్మాణానికి డబ్బులు తెచ్చుకుందామని రాజమౌళి ఈ ఈవెంట్ భారీగా ప్లాన్ చేసాడని అంటున్నారు.
అందుకే ఈ ఈవెంట్ హక్కులు కూడా డబ్బుల కోసం జియో హాట్ స్టార్ ఓటీటీకి భారీ ధరకు అమ్ముకున్నారు. దాదాపు 50 కోట్లపైనే ఈ ఈవెంట్ హక్కులు జియో హాట్ స్టార్ కి అమ్మారట. సాయి దుర్గ ఆర్ట్స్ మాత్రమే కాకుండా షోయింగ్ బిజినెస్ అనే నిర్మాణ సంస్థ పేరుని కూడా వారణాసి గ్లింప్స్ లో జత చేసారు.
Also Read : Rajamouli : నిజంగా మహేష్ బాబు గ్రేట్.. ఈ రోజుల్లో అసలు అలా ఉండగలరా.. రాజమౌళి వ్యాఖ్యలు వైరల్..
దీంతో రాజమౌళి – మహేష్ సినిమాకు బడ్జెట్ పెరిగిందని, దానికి కావాల్సిన డబ్బులు సర్దడంలో నిర్మాత కష్టపడటంతో రాజమౌళి తానే ఇన్వెస్టర్స్ ని తెప్పిస్తున్నాడని తెలిసింది. గతంలో కూడా బాహుబలి సమయంలో పార్ట్ 2 కి రాజమౌళి ఏదో ఒకటి చేసి బాలీవుడ్ నుంచి ఇన్వెస్టర్స్ ని తెప్పించాలనుకున్నాను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో రాజమౌళి కూడా నిర్మాతగా మారడంతో రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో షేర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. కార్తికేయ కూడా గతంలో రాజమౌళి సినిమాలకు బాగానే పని చేసాడు. ఇప్పుడు ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు తీసుకోవడంతో మరింత ఎక్కువ కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో కార్తికేయకు హాలీవుడ్ లెవల్లో నిర్మాతగా పేరు రావడం ఖాయం.