Rajamouli Planing For Another Sequel
దర్శకధీరుడు రాజమౌళి మరో సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఈగ’ సినిమాతో ఒక కొత్త ఫాంటసీ యాక్షన్ జోనర్‌ను పరిచయం చేసిన జక్కన్న, ఇప్పుడు ‘ఈగ-2’తో మరో ప్రయోగం చేయబోతున్నాడట. ఈ సినిమాలో కూడా గతంలోలా కొత్త ఆర్టిస్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
హీరో, విలన్ ఇద్దరూ యువ నటులై ఉండొచ్చని, అదీ కూడా టాలీవుడ్‌లో ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని వారై ఉండే అవకాశం ఉందని టాక్. రాజమౌళి మళ్లీ తనదైన విజువల్ మ్యాజిక్‌తో, AIని వాడి సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాడని అంటున్నారు.
Balakrishna : పవన్ సినిమా వదిలేసిన డైరెక్టర్ తో.. బాలయ్య సినిమా ఫిక్స్..? ఆ సినిమాకు సీక్వెల్..?
ఈగ పార్ట్-1 సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్, విలన్ పాత్రలో సుదీప్ నటనతో సంచలనం సృష్టించింది. ఈ సారి ఈగ-2లో కూడా విలన్ పాత్ర అంతే పవర్ ఫుల్‌గా ఉంటుందని, హీరోగా ఒక యువహీరో, అతనికి జోడీగా అప్ కమింగ్ హీరోయిన్‌ను పరిచయం చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. AI టెక్నాలజీతో కొత్త రకమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను మరోసారి కట్టిపడేయాలనేది రాజమౌళి స్కెచ్ అంటున్నారు.
ఈగలో ఒక చిన్న ఈగ హీరోగా మారినట్లే, ఈగ-2లో కూడా ఒక అసాధారణ కాన్సెప్ట్‌తో కథ సాగుతుందని అంటున్నారు. AIతో ఈ సినిమాలోని పాత్రలు మరింత రియలిస్టిక్‌గా, ఎమోషనల్‌గా కనిపించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగమవుతారని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. ఇది రియలో వైరలో జక్కన్నే క్లారిటీ ఇవ్వాలి.