Rajamouli reply to ntr tweet
Rajamouli : చరణ్, ఎన్టీఆర్ ని కలిపి RRR లాంటి అద్భుతమైన సినిమా అందించారు రాజమౌళి. ఈ సినిమాతో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక హాలీవుడ్ లో అయితే రాజమౌళి పనితీరుని మెచ్చుకుంటూ అంతా అభినందిస్తున్నారు. హాలీవుడ్ లో పలు అవార్డులు, రివార్డులు రాజమౌళిని వరిస్తున్నాయి.
తాజాగా న్యూయార్క్ ఫిలిం సిటీ సర్కిల్స్ అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు సాధించారు రాజమౌళి. దీంతో ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాజమౌళిని అభినందిస్తూ తారక్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో.. ”కంగ్రాట్స్ జక్కన్న. ప్రపంచవ్యాప్తంగా కీర్తికి మీకు ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. మీ గురించి నాకు ఏం తెలుసో అది ప్రపంచమంతా తెలుసుకోవాలి” అని ట్వీట్ చేశారు.
Adivi Sesh : మహేష్ బాబు ఫోన్ చేసి మాట్లాడితే ఏడ్చేశాను..
అయితే దీనికి రాజమౌళి రిప్లై ఇస్తూ చిన్న కరెక్షన్ తారక్.. నా జర్నీ కాదు, మన జర్నీ బిగినింగ్ అని ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు మన జర్నీ అంటున్నారంటే కచ్చితంగా వీరి కాంబినేషన్ లో ఇంకో సినిమా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ చేతిలో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు ఉన్నాయి. ఒకవేళ మళ్ళీ రాజమౌళి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఉండాలన్నా అది ఇప్పుడిప్పుడే అవ్వదు.
Haha. Small correction Tarak… Beginning of *OUR JOURNEY..:) https://t.co/ZFBQFmMlp8
— rajamouli ss (@ssrajamouli) December 3, 2022