Rajamouli reveals original second half story of RRR
Rajamouli : మరో నాలుగు రోజుల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతుంది. అయినాసరి ఇంకా ఈ సినిమా మాట వినిపిస్తూనే ఉంది. అదికూడా భారతీయ సినీ పరిశ్రమలో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ మూవీ పేరు ఇప్పటికి వినిపిస్తూనే వస్తుంది. రీసెంట్ గా ఆస్కార్ వేదిక పై మరోసారి ఆర్ఆర్ఆర్ విజువల్స్ కనిపించి.. టాలీవుడ్ ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఇక జపాన్ లో అయితే ఈ మూవీ గురించి ప్రతి నెల ఏదో న్యూస్ వినిపిస్తూనే ఉంది.
జపాన్ ఆడియన్స్ ఈ సినిమాని అంత చేరువ చేసుకున్నారు. జపాన్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అవుతుంది. కానీ ఇప్పటికి ఈ చిత్రం అక్కడ ఆడుతూనే వస్తుంది. తాజాగా రాజమౌళి జపాన్ టూర్ కి వెళ్లారు. అక్కడ అభిమానులతో కలిసి ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోని చూసారు. అనంతరం అభిమానులతో ఆర్ఆర్ఆర్ గురించి, నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడారు. ఈక్రమంలోనే ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ ముందు రాసుకున్న కథ వేరు అని తెలియజేసారు.
Also read : RC16 : రామ్‌చరణ్ RC16 బయోపిక్‌గా రాబోతోందా.. లండన్ రాజులతో సత్కరించబడ్డ ఫస్ట్ ఇండియన్.. టైటిల్ అదేనా..
ముందు రాసుకున్న కథలో.. భీమ్, రామ్ ని కాపాడడం కోసం జెన్నీ జైలు ప్లాన్ ని అడుగుతాడు. ఆమె దొంగతనంగా స్కాట్ రూమ్ లోకి వెళ్లి ఆ ప్లాన్ తీసుకోని వచ్చి భీమ్ కి ఇస్తుంది. అలా ఇచ్చి తిరిగి వస్తున్న సమయంలో జెన్నీని తన లేడీ స్కాట్ చూస్తుంది. జెన్నీ షూస్ కి అంటున్న మట్టి చూసి.. తనో ఏదో రహస్య పని చేసింది అని భావిస్తుంది. ఆ తరువాత భీమ్, రామ్ ని సేవ్ చేసి తీసుకువెళ్లిన తరువాత అర్ధమవుతుంది.. ఇది జెన్నీ పనే అని.
దీంతో ఈ విషయాన్ని స్కాట్ కి తెలియజేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న స్కాట్.. జెన్నీని తుపాకీతో షూట్ చేసి చంపేస్తాడు. ఈ సీక్వెన్స్ అంత కూడా షూట్ చేశారట. కానీ భీమ్, జెన్నీ స్టోరీ సాడ్ ఎండింగ్ ఉంటుందని భావించి, ప్రీ క్లైమాక్స్ లో అంత వివరణ కూడా అవసరం లేదని భావించి.. ఆ సీన్స్ అన్నిటిని తీసేశారట. ఈ విషయాన్ని రాజమౌళి జపాన్ ఆడియన్స్ కి తెలియజేసారు. ఇక ఇది విన్న కొంతమంది ఆడియన్స్.. ఈ సీన్స్ కూడా ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతున్నారు.
Second half enti intha weak ga undhi Ani anupudey anukunna . #RRR pic.twitter.com/38mb9exVNZ
— ⚡ (@Sidhu_SSMB) March 19, 2024