Rajamouli : రాజమౌళి వ్యాఖ్యలతో.. నిరాశలో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్..

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Rajamouli

Rajamouli : రాజమౌళి.. స్టార్ డైరెక్టర్ మాత్రమే కాదు. తెలుగు సినీ పరిశ్రమని ఆస్కార్ దాకా తీసుకెళ్లిన వ్యక్తి. రాజమౌళి సినిమా కోసం సామాన్య ప్రేక్షకుల నుంచి అన్ని సినీ పరిశ్రమల సెలబ్రిటీల వరకు ఎదురుచూస్తుంటారు. RRR తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా కోసం హాలీవుడ్ సైతం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల రాజమౌళి పలు సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వస్తున్నారు. నిన్న జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కొన్ని ఫొటోలు చూపించి వాటి మెమరీస్ చెప్పమన్నారు. ఈ క్రమంలో ఈగ సినిమా ఫోటో చూపించగా మై బెస్ట్ ఫిలిం ఈగ అని చెప్పారు రాజమౌళి. దీంతో రాజమౌళి తీసిన సినిమాల్లో ఆయనకు బెస్ట్ ఫిలిం ఈగ అనే వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Sreeleela – Samantha : అలాంటి హీరోలతో చేసేందుకు.. అప్పుడు సమంత.. ఇప్పుడు శ్రీలీల.. భారీగా..

అయితే ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. రాజమౌళి – ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని తెల్సిందే. వీరిద్దరి కాంబోలో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR సినిమాలు రాగా అన్ని పెద్ద హిట్ అయ్యాయి. ఇక చరణ్ తో ఇండస్ట్రీ హిట్ మగధీర, RRR సినిమాలు తీసాడు. ప్రభాస్ – రాజమౌళి బాండింగ్ అయితే చాలా స్పెషల్. వీరిద్దరి కాంబోలో బాహుబలి రెండు పార్టులు, ఛత్రపతి సినిమాలు వచ్చాయి.

చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లతో అంత మంచి బాండింగ్ పెట్టుకొని, అన్ని సూపర్ హిట్ సినిమాలు తీసి ఆయా హీరోల సినిమాల పేర్లు చెప్పకుండా ఈగ బెస్ట్ ఫిలిం అని చెప్పడంతో పలువురు ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈగ అనేది వీటన్నిటికంటే కూడా సాంకేతికంగా, దర్శకుడిగా రాజమౌళికి ఎక్కువ సంతృప్తి, ఎక్కువ కష్టపడ్డ సినిమా కావడంతో ఈగ ఆయనకు స్పెషల్ ఫిలిం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’లో సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ ఇవే.. ఆ సీన్స్ తీసేయమని.. సినిమా టోటల్ రన్ టైం ఎంతంటే?