HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’లో సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ ఇవే.. ఆ సీన్స్ తీసేయమని.. సినిమా టోటల్ రన్ టైం ఎంతంటే?
ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.

HariHara VeeraMallu
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జులై 24న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.
సెన్సార్ బోర్డు సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు ఫైనల్ రన్ టైం 2 గంటల 42 నిముషాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హరిహర వీరమల్లు సినిమాలో సెన్సార్ బోర్డు మొత్తం 5 ఛేంజెస్ చెప్పినట్లు సమాచారం.
సినిమా మొదలయ్యే ముందు.. ఇది కొన్ని రిఫరెన్సులు తీసుకొని ఫిక్షన్ జోడించి తీసిన సినిమా అని, కేవలం వినోదం కోసమే, ఎవర్ని నొప్పించడానికి కాదని వాయిస్ ఓవర్ ఇమ్మన్నారు.
Also Read : Tanya Ravichandran : ప్రియుడికి లిప్ కిస్ ఇస్తూ.. పెళ్లి గురించి చెప్పేసిన హీరోయిన్..
అలాగే ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ పేరు ఖులీ ఖుతుబ్ షా అని పెట్టగా ఆ పేరుని వినపడనివ్వకుండా మ్యూట్ చేయమని చెప్పారు.
సినిమాలో విగ్రహాలు పడగొట్టే ఓ సీన్ ఉండగా అది తొలగించామన్నారు.
సినిమాలో గర్భిణి స్త్రీలపై దాడి చేసిన సీన్స్ నిడివి తగ్గించామన్నారు.
గుడి తలుపులను తన్నే సన్నివేశం ఉండగా దాన్ని కూడా తొలగించమనట్టు సమాచారం.
మొత్తంగా సెన్సార్ బోర్డు ఆదేశాలతో హరిహర వీరమల్లు సినిమాలో 5 మార్పులతో 20 సెకండ్స్ వాయిస్ ఓవర్ జోడించి 24 సెకండ్లు తొలిగినచున్నట్టు తెలుస్తుంది.
Also Read : Anupama Parameswaran : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..