Tanya Ravichandran : ప్రియుడికి లిప్ కిస్ ఇస్తూ.. పెళ్లి గురించి చెప్పేసిన హీరోయిన్..
తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న బ్యూటీల్లో తాన్య రవిచంద్రన్ ఒకరు

Actress Tanya Ravichandran shares boyfriend Photo
తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న బ్యూటీల్లో తాన్య రవిచంద్రన్ ఒకరు. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీలో నయనతార చెల్లిగా నటించింది. చేసింది చిన్నపాత్రే కానీ ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. కాగా.. ఈ అమ్మడు ప్రేమలో పడిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
తన ప్రియుడికి కిస్ ఇస్తూ దిగిన ఫోటోను షేర్ చేసింది. ‘ఒక ముద్దు.. ఒక ప్రామిస్.. ఎప్పుడూ.. ఎప్పటికీ కలిసే..’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చింది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. ఇంతకు ఆమె ప్రియుడు ఎవరో కాదు కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్. దీంతో వీరిద్దరి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
SSMB29 : సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న రాజమౌళి..! SSMB29 గ్లింప్స్ ఆరోజేనా?
View this post on Instagram
తాన్య అసలు పేరు అభిరామి శ్రీరామ్. 2016లో ‘బల్లే వెల్లాయతీవా’ అనే చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ‘కరుప్పన్’, ‘నేంజుకు నీదీ’, ‘మాయన్’, ‘ట్రిగ్గర్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2021లో కార్తీకేయ హీరోగా నటించిన ‘రాజా విక్రమార్క’ చిత్రంతో తెలుగువారిని పలకరించింది. తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’లో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె రెట్ట థలా అనే మూవీలో నటిస్తున్నారు.