Rajamouli : నేను నమ్మే సిద్ధాంతాలు ఒకటి.. తీసే సినిమాలు ఒకటి.. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి స్పీచ్ వైరల్..

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ..

Rajamouli Speech in Nagarjuna Dhanush Kubera Movie Pre Release Event

Rajamouli : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. ఈ సినిమా జూన్ 20 రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.

Also Read : Dil Raju : గద్దర్ అవార్డులు తీసుకోడానికి రానివాళ్లపై దిల్ రాజు కామెంట్స్.. మీరే వచ్చి అవార్డులు తీసుకోవాలి..

ఈ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడుతూ.. శేఖర్ తను నమ్మిన ప్రిన్సిపల్స్ మీదే సినిమాలు చేస్తాడు. మేమెవ్వరం మేము నమ్మే ప్రినిస్పల్స్ మీద సినిమాలు చెయ్యము. నేను నమ్మే సిద్ధాంతాలు ఒకటి చేసే సినిమాలు ఒకటి. శేఖర్ వచ్చి 25 ఏళ్ళు అయిపోయింది అంటే నమ్మలేకపోతున్నా. ఇన్నాళ్లు నేను శేఖర్ నాకు జూనియర్ అనుకున్నా. నాకు ఒక సంవత్సరం సీనియర్. 25 ఏళ్ళు అలాగే ఉన్నాడు. అలాగే సినిమాలు తీసాడు. ఫ్యూచర్ లో కూడా అలాగే ఉండాలి. అసలు శేఖర్ ఇలాంటి సినిమా తీయడం కొత్త. ధనుష్ – నాగార్జున కాంబో అదిరింది. ట్రైలర్ తో అంచనాలు ఇంకా పెంచింది సినిమా అని తెలిపారు.

Also See : Anasuya Bharadwaj : భర్తతో అనసూయ క్యూట్ ఫొటోలు.. సండే సరదాగా..