Dil Raju : గద్దర్ అవార్డులు తీసుకోడానికి రానివాళ్లపై దిల్ రాజు కామెంట్స్.. మీరే వచ్చి అవార్డులు తీసుకోవాలి..
దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Dil Raju Interesting Comments on who Not Attend to Telangana Gaddar Film Awards Event
Dil Raju : శనివారం జూన్ 14న తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజమౌళి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, దిల్ రాజుతో పాటు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిన వారిలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ అవార్డులు తీసుకోడానికి రాలేదు. నేడు తెలంగాణ FDC చైర్మన్ దిల్ రాజు గద్దర్ అవార్డుల ఈవెంట్ పై ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : The Raja Saab : ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్.. రేపు టీజర్ రిలీజ్ టైం ఎప్పుడంటే?
ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయింది. గద్దర్ అవార్డుల వేడుకలను విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు. అవార్డు వేడుకలకు సీఎం గంట సమయం ఇచ్చారు. గంట సమయం సరిపోదని విజ్ఞప్తి చేస్తే రెండు గంటల పైనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అయినా సరే మీరే వచ్చి తీసుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రలో కూడా నంది అవార్డ్స్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ అందరికీ చెబుతున్నా గుర్తు పెట్టుకోండి అవార్డు వచ్చినవాళ్ళు మీరే వచ్చి స్వీకరించాలి. షూటింగ్స్ లో బిజీగా ఉన్నా అందరూ హాజరు కావాలి. అది మన బాధ్యత. ప్రభుత్వంతో కలిసి జర్నీ చెయ్యాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో అందరిది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ అవార్డులు ఇచ్చినప్పుడు డైరీలో డేట్ నోట్ చేసుకోవాలి. అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరపాట్లు జరిగితే క్షమించాలని FDC చైర్మన్ గా కోరుతున్నా అని అన్నారు.
దీంతో దిల్ రాజు కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి దిల్ రాజు వ్యాఖ్యలపై గద్దర్ అవార్డులు తీసుకోడానికి రానివాళ్లు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.