The Raja Saab : ‘రాజాసాబ్’ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ రిలీజ్.. రేపు టీజర్ రిలీజ్ టైం ఎప్పుడంటే?
తాజాగా రాజాసాబ్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Prabhas The Raja Saab Special Poster Released
The Raja Saab : వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలో రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ సినిమా చేస్తుండటం, తాత గెటప్ లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
తాజాగా రాజాసాబ్ నుంచి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ కార్ మీద స్టైలిష్ గా కూర్చొని ఉన్నాడు. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్ స్టైలిష్ పోస్టర్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజాసాబ్ టీజర్ రేపు జూన్ 16 ఉదయం 10.52 గంటలకు రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఈ టీజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.