Rajamouli
Rajamouli : తెలుగు సినీ చరిత్రని మార్చేసిన సినిమాలు బాహుబలి పార్ట్ 1 & 2. ఈ సినిమాతో పాన్ ఇండియా వైబ్ మొదలైంది. రాజమౌళి గ్రాండ్ గా తెరకెక్కించిన బాహుబలి సినిమాలు ఇండియా వైడ్ సరికొత్త చరిత్రని సృష్టించాయి. కానీ బాహుబలి మొదటి పార్ట్ కి మొదట డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. రాజుల కాలంలో కథ నడిపించడం, భారీ విజువల్స్, గ్రాఫిక్స్, కథని మధ్యలోనే ఆపేసి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం, ఎర్లీ మార్నింగ్ షోలు వేయడం.. ఇవన్న మొదట చూసి సినిమా తొందరగా ఎక్కలేదు ప్రేక్షకులకు. కానీ రిలీజ్ రోజు సాయంత్రం నుంచి టాక్ మారిపోయి పెద్ద హిట్ అయింది.
అయితే పార్ట్ 1 మొదట డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి అందరికి తెలుసు. కానీ పార్ట్ 2 కూడా ఫ్లాప్ అని అనుకున్నారట రాజమౌళి. ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి ఎపిక్ అని రిలీజ్ చేస్తున్న సందర్భంగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి సరదా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అప్పటి సంగతులని పంచుకున్నారు. దీంట్లో బాహుబలి రెండు పార్టులు రిలీజ్ తర్వాత వచ్చిన టాక్ గురించి రాజమౌళి మాట్లాడారు.
Also See : Vandana Kammula : శేఖర్ కమ్ముల కూతురు వందన బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?
రాజమౌళి మాట్లాడుతూ.. అసలు బాహుబలి పార్ట్ 1 హిట్ అయిందని మూడు రోజుల దాక నేను నమ్మలేదు. మొదటి రోజు డిజాస్టర్ టాక్. అందరూ తిట్లు, మీడియా కూడా బాగోలేదు అని చెప్పారు. ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. నాకు ఫుల్ భయం వేసింది. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించలేదు. మధ్యాహ్నానికి సాయి గారు వచ్చి సినిమా బాగుంది కలెక్షన్స్ పెరుగుతున్నాయి, టాక్ పట్టించుకోకండి అని చెప్పినా నేను నమ్మలేదు. శుక్రవారం కంటే శనివారం ఇంకా కలెక్షన్స్ బాగున్నా నేను నమ్మలేదు. ఆదివారం అందరం కలిసాక అప్పుడు కూల్ అయ్యాను. మొదటి రోజు ఫ్లాప్ టాక్ రాగానే ఏదో ఒకటి చేసి సెకండ్ పార్ట్ సింపుల్ గా తీసేయాలి, ముంబై నుంచి ఇన్వెస్టర్స్ తెచ్చి ఒక 70
లేదా 80 కోట్లలో తీసేసి బ్రేక్ ఈవెన్ చేయాలి, నిర్మాతని కాపాడాలి అనుకున్నాను అని తెలిపారు.
ఇక పార్ట్ 2 గురించి మాట్లాడుతూ.. పార్ట్ 2 గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసాము. నార్త్ లో ముందు రోజు రాత్రి స్పెషల్ షో సెలబ్రిటీలకు ప్లాన్ చేసాము. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.. చాలా మంది రావాలి. కరణ్ జోహార్ గ్రాండ్ గా ప్లాన్ చేసాడు ప్రీమియర్ షో. కానీ ఆ రాత్రి వినోద్ ఖన్నా గారు చనిపోవడంతో అలాంటి టైంలో షో పెడితే బాగోదని క్యాన్సిల్ చేశారు. నేను కూడా సరే అని చెప్పాను. ఎలాగో థియేటర్స్ బుక్ చేసాం కదా అని నేను, మా వైఫ్, కొంతమంది టీమ్ సినిమాని చూసాము. నాకేమో బాహుబలి 2 సినిమా చూస్తుంటే నిద్రొస్తుంది.
సినిమా అయ్యాక మా వైఫ్ రమ కూడా సినిమాలో చాలా తప్పులు చెప్పింది. అప్పుడే ఆ సినిమా ఫ్లాప్ అనుకున్నా. హైదరాబాద్ రిటన్ అవ్వాలి. వెళ్లేముందు కరణ్ జోహార్ ని కలిసి వెళ్దాం అనుకుంటే కరణ్, రణబీర్, అలియా కలిసి సపరేట్ గా బాహుబలి 2 చూస్తున్నారు. వాళ్ళు సినిమా చూసి వచ్చి ఓ రేంజ్ లో పొగిడేశారు. సినిమా అదిరిపోయింది, అసలు ఏ రేంజ్ సినిమా తీశారు అని గొప్పగా చెప్తున్నారు. నేనేమో నమ్మకుండా బాంబేలో అందరూ ఇలాగే ఉంటారా, వీళ్ళ మాటలు నమ్మలేము అనుకున్నా. కానీ హైదరాబాద్ రిటర్న్ అయ్యాక ఇక్కడ టాక్ ఓ రేంజ్ లో ఉంది. అప్పుడు హమ్మయ్య అనుకున్న అని తెలిపారు.