Baahubali : బాహుబలి 3 అనౌన్స్.. టైటిల్, బడ్జెట్ చెప్పేసిన రాజమౌళి.. కానీ మాములు సినిమా కాదు.. ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్

తాజాగా బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో బాహుబలి పార్ట్ 3 ప్రస్తావన వచ్చింది. (Baahubali)

Baahubali : బాహుబలి 3 అనౌన్స్.. టైటిల్, బడ్జెట్ చెప్పేసిన రాజమౌళి.. కానీ మాములు సినిమా కాదు.. ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్

Baahubali

Updated On : October 29, 2025 / 6:33 PM IST

Baahubali : బాహుబలి రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చాయి. ఈ రెండు సినిమాలు మన తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రాజమౌళి, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలను కలిపి ఎడిటింగ్ చేసి ఒకే సినిమాలా మార్చి బాహుబలి ఎపిక్ అని అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నారు.(Baahubali)

అయితే బాహుబలి సినిమాకు పార్ట్ 3 కూడా ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కూడా గతంలో బాహుబలి 3 ఉంటుందనే చెప్పారు. తాజాగా బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో బాహుబలి పార్ట్ 3 ప్రస్తావన వచ్చింది.

Also Read: Baahubali The Epic : ‘బాహుబలి ఎపిక్’ ఫైనల్ రన్ టైం ఎంతో తెలుసా? ఏమేం కట్ చేశారు? ఆ ట్రాక్ మొత్తం తీసేసారుగా..

రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి 3 అని ఎప్పట్నుంచో ఉంది కానీ అది రెగ్యులర్ సినిమాలాగా రాదు. అది బాహుబలి 3 కాదు. బాహుబలి ఎటర్నల్ వార్ అని ప్లాన్ చేశాను. బాహుబలి ఎపిక్ సినిమా చివర్లో ఆ టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నాను. బాహుబలి ఎటర్నల్ వార్ బాహుబలి సినిమాకు కంటిన్యుటీనే ఉంటుంది. అయితే అది యానిమేషన్ సినిమా, 3D యానిమేషన్ సినిమా. ఇషాన్ శుక్ల అనే 3D యానిమేషన్ డైరెక్టర్ దీనికోసం వర్క్ చేస్తున్నాడు. అతను కూడా కథకు కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. ఆల్రెడీ రెండున్నరేళ్లుగా ఆ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. 120 కోట్ల బడ్జెట్ తో బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా తెరకెక్కుతుంది. అందులో ట్విస్టులు ఉంటాయి, కథ బాగుంది, అన్ని బాహుబలి క్యారెక్టర్స్ ఉంటాయి. బాహుబలి వరల్డ్ ఇక్కడితో ఆగదు. మున్ముందు ఏదో ఒకరకంగా వస్తూనే ఉంటుంది అని తెలిపారు.

దీంతో బాహుబలి ఫ్రాంజైజ్ లాగా రాజమౌళి ప్లాన్ చేస్తునట్టు తెలుస్తుంది. రాజమౌళి ప్రకటనతో బాహుబలి, ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాహుబలి ఎటర్నల్ వార్ యానిమేషన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేదు.

Also Read : Rajamouli : హమ్మయ్య బతికించారు.. రాజమౌళి తెలివైనోడే.. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు..