Rajamouli : హమ్మయ్య బతికించారు.. రాజమౌళి తెలివైనోడే.. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు..

తాజాగా బాహుబలి ఎపిక్ రిలీజ్ కి ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. (Rajamouli)

Rajamouli : హమ్మయ్య బతికించారు.. రాజమౌళి తెలివైనోడే.. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు..

Rajamouli

Updated On : October 29, 2025 / 5:17 PM IST

Rajamouli : బాహుబలి రిలీజయి పదేళ్లు అవుతుండటంతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన బాహుబలి రెండు సినిమాల పార్ధులని కలిపి ఒకే సినిమాగా ఎడిట్ చేసి బాహుబలి ఎపిక్ అంటూ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న బాహుబలి ఎపిక్ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రాజమౌళికి ప్రమోషన్స్ తక్కువ చేసినా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేలా చేయడం, జనాలని థియేటర్స్ కి రప్పించడం బాగా తెలుసు.(Rajamouli)

తాజాగా బాహుబలి ఎపిక్ రిలీజ్ కి ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి సరదాగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడుకున్నారు. అయితే ఇటీవల భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి రీ రిలీజ్ 100 కోట్ల టార్గెట్ పెట్టుకొని రిలీజ్ చేస్తున్నట్టు టాక్. దీంతో ఈ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుతారని వార్తలు వచ్చాయి.

Also Read : Prabhas Rana : ప్రభాస్, రానా ‘బాహుబలి ఎపిక్’ ని ఏ దేశాల్లో చూస్తారో తెలుసా? ఆ అనుభవం కోసం.. రాజమౌళి అయితే..

తాజాగా రిలీజ్ చేసిన ఇంటర్వ్యూలో రాజమౌళి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలి ఎపిక్ సినిమాకు టికెట్ ప్రైజెస్ నార్మల్ గానే ఉంటాయి. అన్ని స్క్రీన్స్ లో మాములు సినిమాలకు ఉన్న టికెట్ రేట్లే ఉంటాయి. కానీ భారీ రిలీజ్ ఉంటుంది. అందరూ ఈ సినిమాని చూడాలి అని నా ప్లాన్. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ ఉంటుంది. డిఫరెంట్ థియేటర్స్ ఫార్మెట్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసి అందరికి మంచి థియేటరికల్ అనుభవాన్ని ఇవ్వబోతున్నాం అని తెలిపారు.

దీంతో బాహుబలి రీ రిలీజ్ కి టికెట్ రేట్ల పెంపు లేదు అని రాజమౌళిని స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు హమ్మయ్య అనుకుంటున్నారు. టికెట్ రేట్లు పెంచితే థియేటర్స్ కి జనాలు ఎక్కువ రావట్లేదు అనే టాక్ ఉంది. ఇది రాజమౌళి పసిగట్టి జనాలు ఎక్కువ రావాలి, ఈ సారి కూడా కలెక్షన్స్ బాగా రావాలి అని టికెట్ రేట్లు పెంచకుండా ఇలా ప్లాన్ చేసాడు అంటున్నారు.

Also See : Jaanvi Swarup : హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ మేనకోడలు.. ఫోటోలు చూశారా?