Prabhas Rana : ప్రభాస్, రానా ‘బాహుబలి ఎపిక్’ ని ఏ దేశాల్లో చూస్తారో తెలుసా? ఆ అనుభవం కోసం.. రాజమౌళి అయితే..

రాజమౌళి బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. (Prabhas Rana)

Prabhas Rana : ప్రభాస్, రానా ‘బాహుబలి ఎపిక్’ ని ఏ దేశాల్లో చూస్తారో తెలుసా? ఆ అనుభవం కోసం.. రాజమౌళి అయితే..

Prabhas Rana

Updated On : October 29, 2025 / 4:20 PM IST

Prabhas Rana : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు సినిమాలను ఒకటిగా చేసి బాహుబలి ఎపిక్ గా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గ్రాండ్ గా, డిఫరెంట్ ఫార్మెట్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి ఎపిక్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ప్రభాస్, రానా, రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.(Prabhas Rana)

రాజమౌళి బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. గతంలో అన్ని ఫార్మెట్స్ లో రిలీజ్ చేయలేకపోయాము. ఇప్పుడు అన్ని ఫార్మెట్స్ లో రిలీజ్ చేస్తున్నాము. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము. IMAX, Dolby Cinema, D Box, 4DX, EPIQ, ICE థియేటర్స్, PCX .. ఇలా డిఫరెంట్ ఫార్మెట్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నాము. డాల్బీ విజన్ అవుట్ ఫుట్ అయితే అదిరిపోయింది. మన ఇండియాలో అది పర్ఫెక్ట్ థియేటర్ పుణేలో ఒక్కటే ఉంది. అందులో సినిమా చూస్తే వేరే లెవల్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. వరల్డ్ లోని బిగ్గెస్ట్ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాము. అమెరికాలో ఉందే అన్ని హై ఎండ్ ఐమాక్స్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాము. అన్ని రకాల అవుట్ పుట్స్, అన్ని రకాల ఫార్మెట్స్, అన్ని రకాల భాషలు కలుపుకొని మొత్తం 60 నుంచి 70 దాకా అవుట్ పుట్స్ వచ్చాయి అని తెలిపారు.

Also Read : Prabhas : బాహుబలి కర్నూల్ షూట్.. ఫ్యాన్స్ ని కొడుతుంటే ప్రభాస్ ఎంత బాధపడ్డాడో.. రానా రోడ్డు మీద ఎవరిదో కార్ ఆపి..

అయితే అలాంటి బెస్ట్ సినిమాటిక్ అనుభవం కోసం రానా అయితే నేను అమెరికా లాస్ ఏంజిల్ లో బాహుబలి ఎపిక్ సినిమా చూస్తాను అని చెప్పగా ప్రభాస్ జపాన్ లో రిలీజ్ అవుతుంది కదా నేను అక్కడ చూస్తాను అన్నారు. రాజమౌళి మాత్రం హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టిప్లెక్స్ లో PCX స్క్రీన్ లో చూస్తాను అని తెలిపారు.