Prabhas : బాహుబలి కర్నూల్ షూట్.. ఫ్యాన్స్ ని కొడుతుంటే ప్రభాస్ ఎంత బాధపడ్డాడో.. రానా రోడ్డు మీద ఎవరిదో కార్ ఆపి..
బాహుబలి ఎపిక్ రిలీజ్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. (Prabhas)
Prabhas
Prabhas : బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే సినిమాగా ఎడిట్ చేసి బాహుబలి ఎపిక్ అంటూ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కూడా గ్రాండ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసాడు రాజమౌళి. అక్టోబర్ 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. బాహుబలి ఎపిక్ రిలీజ్ లో భాగంగా ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ముగ్గురూ సరదాగా మాట్లాడుతూ అప్పటి సంగతులను పంచుకున్నారు.(Prabhas)
ఈ క్రమంలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఫస్ట్ షూట్ చేసింది కర్నూల్ లో. జనాల మధ్య షూట్ చేసాము. నేను అసలే జనాల్లోకి వెళ్ళను. నన్ను తీసుకొచ్చి అక్కడ నిల్చోపెట్టారు. కానీ అక్కడ షూట్ చేసింది ఏది సినిమాలో వాడలేదు. రెండో రోజు వర్షం, ఓ పక్కన బురద. షూట్ అయ్యాక వెళ్లిపోతుంటే జనాలు వెంటపడటంతో పై నుంచి మనం గుర్రాల మీద కిందకు వచ్చాము. అప్పుడు మన కార్ ఏదో సమస్య వస్తే రానా రోడ్డు మీద వెళ్లే కార్ ఆపి నేను, రాజమౌళి, ప్రభాస్ ముగ్గురం నీ కార్ ఎక్కుతాం ఓకే నా అని అడిగాడు. వాడు షాక్ అయి సైలెంట్ అయిపోయాడు. ఎవరి కార్ అంటే ఏమో అంటాడు రానా. ఎవరిదో కార్ ఎక్కి కొంచెం దూరం వెళ్లి తర్వాత మన కార్ లోకి వెళ్ళాము అని చెప్పుకొచ్చారు.
అదే రోజు జరిగిన సంఘటన గురించి రాజమౌళి చెప్తూ.. మనం వెళ్లిపోతుంటే హోటల్ దగ్గర బయట బాగా జనాలు రావడంతో కార్తికేయ, పోలీస్ లు లాఠీతో జనాల్ని క్లియర్ చేస్తుంటే.. ప్రభాస్ రానా చెయ్యి పట్టుకొని అరే కొట్టొద్దురా.. ఫ్యాన్స్ రా పాపం.. ప్లీజ్ రా కొట్టొద్దురా అన్నాడు. రానా ఏమో ఏం కాదు బావ అని సర్ది చెప్పాడు అని తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ గురించి అంతలా ప్రభాస్ ఆలోచిస్తాడు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
