Baahubali The Epic : ‘బాహుబలి ఎపిక్’ ఫైనల్ రన్ టైం ఎంతో తెలుసా? ఏమేం కట్ చేశారు? ఆ ట్రాక్ మొత్తం తీసేసారుగా..

ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ఏమేం సీన్స్ కట్ చేసారో తెలిపారు. అలాగే ఫైనల్ సినిమా నిడివి ఎంత వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు.(Baahubali The Epic)

Baahubali The Epic : ‘బాహుబలి ఎపిక్’ ఫైనల్ రన్ టైం ఎంతో తెలుసా? ఏమేం కట్ చేశారు? ఆ ట్రాక్ మొత్తం తీసేసారుగా..

Baahubali The Epic

Updated On : October 29, 2025 / 5:36 PM IST

Baahubali The Epic : రెండు బాహుబలి సినిమాలను కలిపి బాహుబలి ఎపిక్ గా అక్టోబర్ 31 న రిలీజ్ చేస్తున్నారు. దీనికోసం రాజమౌళి, ఈ సినిమా సాంకేతిక నిపుణులు చాలానే కష్టపడ్డారు. గత అయిదారు నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేశారు. రెండు సినిమాలను కలిపి చూపించాలి, కథ డిస్టర్బ్ అవ్వకుండా చూపించాలి, సినిమా నిడివి ఎక్కువ ఉండకూడదు అంటే సినిమాలో చాలా సీన్స్ కటింగ్ లో తీసేయాల్సిందే. దాంతో రాజమౌళి బాహుబలి సినిమాల్లో ఏ ఏ సీన్స్ కట్ చేసాడో అనే ఆసక్తి నెలకొంది.(Baahubali The Epic)

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి ఓ సరదా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ఏమేం సీన్స్ కట్ చేసారో తెలిపారు. అలాగే ఫైనల్ సినిమా నిడివి ఎంత వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు.

Also Read : Rajamouli : హమ్మయ్య బతికించారు.. రాజమౌళి తెలివైనోడే.. ఆ విషయంలో క్లారిటీ ఇచ్చేసాడు..

రాజమౌళి మాట్లాడుతూ.. రెండు సినిమాలు కలిపి రోలింగ్ టైటిల్స్ తీసేస్తే 5 గంటల 27 నిముషాలు సినిమా మొత్తం. ఇప్పుడు ఫైనల్ అవుట్ పుట్ 3 గంటల 43 నిముషాలు వచ్చింది. సినిమాలో అవంతిక లవ్ స్టోరీ ట్రాక్ తీసేసాను. పచ్చబొట్టేసిన సాంగ్, కన్నా నిదురించారా సాంగ్, ఇరుక్కుపో సాంగ్ కట్ చేశాను. యుద్ధ సన్నివేశాల్లో కొన్ని సీన్స్ కట్ చేశాను. కేవలం డైరెక్ట్ కథ మాత్రమే చెప్పేలా సినిమా ఎడిట్ చేశాను.ముందు 4 గంటల 10 నిముషాలు రఫ్ కట్ చేసి కొంతమందికి సినిమా చూపించాను. వాళ్ళ దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ కట్ చేశాను. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ తీసేసేటప్పుడు గుండె కట్ చేసినట్టు బాధగా అనిపించింది అని తెలిపారు. మరి ఈ కొత్త ఎడిటింగ్ వర్షన్ థియేటర్లో ఏ రేంజ్ అనుభవం ఇస్తుందో చూడాలి.

Also Read : Prabhas Rana : ప్రభాస్, రానా ‘బాహుబలి ఎపిక్’ ని ఏ దేశాల్లో చూస్తారో తెలుసా? ఆ అనుభవం కోసం.. రాజమౌళి అయితే..