Rajamouli visits Allu Arjun Pushpa 2 set
Rajamouli – Sukumar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ ‘పుష్ప2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు కీలక నటీనటులు అందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. కొన్ని డమ్మీ సన్నివేశాల చిత్రీకరణతో పాటు సెట్స్‌కి సంబంధించిన పనులతో రాజమౌళి సైతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాడట.
Game Changer :’ రా మచ్చా మచ్చా’ సాంగ్.. సింగిల్ డాన్స్ సీక్వెన్స్‌తో దుమ్ము రేపిన రామ్‌చరణ్.. 1000కి పైగా జానపద కళాకారులు
పుష్ప 2 మూవీ షూటింగ్ అక్కడే జరుగుతుందని తెలుసుకున్న రాజమౌళి వెంటనే అక్కడకు వెళ్లి వారందరికి సర్‌ప్రైజ్ ఇచ్చారట.
రాజమౌళి పుష్ప 2కు వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు సుకుమార్.. రాజమౌళితో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘మా సినిమా పుష్ప2 సెట్‌లో రాజమౌళి కలవడం ఎన్నటికి మరిచిపోలేని అనుభూతి. రాజమౌళి రాకతో సెట్‌లో అందరికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.’ అంటూ రాసుకొచ్చారు.