తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో రూపొందిన ‘సాండ్ కీ ఆంఖ్’.. చిత్రానికి రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది..
ఉత్తరప్రదేశ్‌లో ‘షూటర్ దాదీస్’గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా.. తాప్సీ పన్ను, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్‌గా, తుషార్ హీరానందని డైరెక్షన్‌లో.. ‘సాండ్ కీ ఆంఖ్’.. మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మించారు.
ఇటీవలే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘సాండ్ కీ ఆంఖ్’ ప్రత్యేక ప్రదర్శన చూసి, మూవీ టీమ్‌ని అభినందించారు. రీసెంట్‌గా ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రానికి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ట్విట్టర్‌లో ప్రకటించింది.
చంద్రో తోమర్‌గా భూమి, ప్రకాషీ తోమర్‌గా తాప్సీ నటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు భారీ వ్యూస్ వచ్చాయి. ప్రకాష్ ఝా, వినీత్ కుమార్ సింగ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ‘సాండ్ కీ ఆంఖ్’ విడుదలవుతోంది. మ్యూజిక్ : విశాల్ మిశ్రా, సినిమాటోగ్రఫీ : సుధాకర్ రెడ్డి యెక్కంటి, స్క్రీన్‌ప్లే : జగదీప్ సింధు.